ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆశ్రమ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెంచాలి

ABN, First Publish Date - 2022-12-09T22:56:08+05:30

గిరిజన ఆశ్రమ పాఠశా లలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని ఐటీడీఏ పీవో వరు ణ్‌ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్ర మ పాఠశాలను ఆదిలాబాద్‌ శిక్షణ సహాయ కలెక్టర్‌ పి.శ్రీజతో కలిసి తనిఖీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్షెట్టిపేట, డిసెంబరు 9: గిరిజన ఆశ్రమ పాఠశా లలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని ఐటీడీఏ పీవో వరు ణ్‌ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్ర మ పాఠశాలను ఆదిలాబాద్‌ శిక్షణ సహాయ కలెక్టర్‌ పి.శ్రీజతో కలిసి తనిఖీ చేశారు. ఉదయం అల్పాహారం రుచి చూసి, మెనూ వివరాలను తెలుసుకున్నారు. పీవో మాట్లాడుతూ నాణ్యమైన భోజనాన్ని అందించా లని, స్టోర్‌ రూమ్‌లో రికార్డులను, వసతి గృహంలో సదుపాయాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని ఉపాధ్యాయు లను ఆదేశించారు. విద్యార్థులలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు అక్షర జ్యోతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టా మన్నారు. చదవడం, రాయడం తప్పనిసరిగా రావా లని, విద్యార్థుల సామర్థ్యానికి అనుకూలంగా విద్యా బోధన చేయాలని వివరించారు. విద్యార్థులకు వ్యక్తి గత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని వసతి గృహ సిబ్బందికి సూచించారు. శిక్షణ సహాయ కలెక్టర్‌ శ్రీజ మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పిం చాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉత్త మ ర్యాంకులు సాధించాలని కోరారు. ప్రధానోపాధ్యా యులు బాలచందర్‌, వార్డెన్‌ రాథోడ్‌ గణేష్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T22:56:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising