ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN, First Publish Date - 2022-08-05T04:05:25+05:30

గ్రామాల్లో పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ భారతి హోళికేరి సూచించారు. గురువారం కోటపల్లి, పంగిడి సోమారం గ్రామంలో పర్యటించారు. కోటపల్లిలో నర్స రీని పరిశీలించిన ఆమె పిచ్చి మొక్కలు పెరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పంగిడిసోమారం చేరుకుని పాఠశాల, డంపింగ్‌ యార్డును పరిశీలిం చారు. పాఠశాల విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్‌ మధ్యాహ్న భోజనం, సౌకర్యాలు, ఉపాధ్యాయుల హాజ రుపై ఆరా తీశారు.

నర్సరీని పరిశీలిస్తున్న కలెక్టర్‌ భారతి హోళికేరీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటపల్లి, ఆగస్టు 4: గ్రామాల్లో పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ భారతి హోళికేరి సూచించారు. గురువారం కోటపల్లి, పంగిడి సోమారం గ్రామంలో పర్యటించారు. కోటపల్లిలో నర్స రీని పరిశీలించిన ఆమె పిచ్చి మొక్కలు పెరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పంగిడిసోమారం చేరుకుని పాఠశాల, డంపింగ్‌ యార్డును పరిశీలిం చారు. పాఠశాల విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్‌ మధ్యాహ్న భోజనం, సౌకర్యాలు, ఉపాధ్యాయుల హాజ రుపై ఆరా తీశారు. పాఠశాల ఆవరణను స్వచ్ఛంగా ఉంచుకోవాలన్నారు. డంపింగ్‌యార్డు సమీపంలో నీరు నిలిచి ఉండగా తొలగించాలని, నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. తిరు గు ప్రయాణంలో శెట్‌పల్లి పాఠ శాలను సందర్శించిన కలెక్టర్‌ అక్కడ నిరుపయోగంగా ఉన్న భవనాన్ని పరిశీలించి మరమ్మతు చేయించా లన్నారు. గ్రామాల్లో క్లోరినేషన్‌ పను లు, మురికి గుంతల వద్ద బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం లాంటి అంశాలపై  సూచనలు ఇచ్చారు. ఎంపీడీవో భాస్కర్‌, ఎంపీవో అక్తర్‌ మొహియో ద్దీన్‌, సర్పంచు తులసీ  ఉన్నారు.  

Updated Date - 2022-08-05T04:05:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising