ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోతుల బీభత్సం

ABN, First Publish Date - 2022-12-16T01:32:28+05:30

జిల్లా కేంద్రంతో పాటు ఖానాపూర్‌, భైంసా పట్టణాల్లోనే కాకుండా చాలా గ్రామాల్లో కోతులతో జనం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.

నిర్మల్‌ జిల్లా చించోలి వద్ద గల గండి రామన్న హరితవనంలో నిర్మించిన కోతుల పునరావాస కేంద్రం ఇదే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్న జనం

చేతిలో కర్ర లేకుండా నడవలేని పరిస్థితి

బెదిరిస్తే ఎదురుదాడి

ఇప్పటికే చాలా మందికి గాయాలు

మంకీరెస్క్యూ సెంటర్‌కు తరలిరాని కోతులు

గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం

నిర్మల్‌, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంతో పాటు ఖానాపూర్‌, భైంసా పట్టణాల్లోనే కాకుండా చాలా గ్రామాల్లో కోతులతో జనం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ముఖ్యంగా గత ఐదారు నెలల నుంచి కోతుల గుంపుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం జనాన్ని ఆందోళనకు గురి చే స్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోని గల్లీల్లో కోతుల బీభత్సంతో తల్లడిల్లిపోతున్నారు. వీధులన్నింటినీ కోతులు హైజాక్‌ చేసి గంటల తరబడి హంగామా సృష్టిస్తున్నాయి. గల్లీల్లో కోతుల గుంపులన్నీ భారీసంఖ్యలో గలాటా చేస్తున్న కారణంగా జనం ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక అవస్థల పాలవుతున్నారు. చేతిలో కర్రలేకుండా ఒక గల్లీ నుంచి మరో గల్లీకి దాటి వెళ్లడం పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ఒకవేళ ఎవరైనా ఒక కోతిని బెదిరిస్తే గుంపులుగా వచ్చి ఎదురుదాడి చేస్తున్నాయి. ఇప్పటి కే చాలా మంది కోతుల దాడిలో గాయపడ్డ వారు ప్రభుత్వాసుపత్రిలో ప్రతిరోజూ ఐదారుగురు కన్నా ఎక్కువ మంది కోతుల దాడిలో గాయపడి చికిత్స కోసం వస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. అయితే కోతులు ఇళ్లల్లోకి కూడా చొరబడుతూ బీభ త్సం సృష్టిస్తున్నాయి. కోతులు కోట్లాడుకుంటూ గుం పులు గుంపులుగా దాడులు చేసుకుంటుంటడంతో ప్రజలు ఆ దృశ్యాలను చూసి భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు చాలా కోతులతో జనం సహవాసం చేస్తూ తీవ్రటెన్షన్‌కు లోనవుతున్నారు. ఇప్పటికే చాలా మంది మున్సిపల్‌ అధికారులకు, ఫారెస్ట్‌ అధికారులకు ఫిర్యాదులు చేసిన్నా ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లల్లోకి చొరబడుతున్న కోతులు అక్కడి పంట చేలను సైతం నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. గుంపులు గుంపులుగా పంటలపై దాడు లు చేస్తుండడంతో రైతులు రాత్రింబవళ్లు వాటిని అడ్డుకునేందుకు కాపలా కాస్తున్నారు. పంటలను కోతుల నుంచి రక్షించుకోవడం రైతులకు ఒక సవాలుగా మారింది. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు సైతం ఈ కోతుల బాధ నుంచి ఎలా బయటపడతామోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు కోతుల నుంచి జనాన్ని, రైతులను కాపాడేందుకు కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. పట్టించుకోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు

కోతుల నుంచి రక్షించే విషయంలో సంబంధిత మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు పూర్తిగా నిర ్లక్ష్యం వహిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని కోతులను మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు పట్టుకొని నిర్మల్‌లోని కోతుల పునరావాస కేంద్రానికి తరలించాల్సి ఉంది. అయితే కోతులను పట్టే వ్యవహారం ఖరీదుగా మారిపోవడమే కాకుండా కోతులు పట్టేవారు కూడా అందుబాటులో లేకపోతుండడం సమస్య జటిలం చేస్తుందంటున్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో కోతులను పట్టుకునేందుకు ఎలాంటి బడ్జెట్‌ లేకపోవడం ఓ సమస్యగా మారిందంటున్నారు. అయితే కొన్ని గ్రామ పంచాయతీలు మాత్రం సాధారణ నిధుల నుంచి కోతులను పట్టుకొని నిర్మల్‌లోని పునరావాస కేంద్రానికి తరలిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఇక్కడి చించోలి వద్ద గల కోతుల పునరావాస కేంద్రానికి సిద్దిపేట, నర్సాపూర్‌ మున్సిపాలిటీల నుంచి దాదాపు 500 కోతులను కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ కోసం తీసుకువచ్చినట్లు ఇక్కడి వైద్యాధికారి తెలిపారు. అయితే జిల్లా నుంచి మాత్రం ఆశించిన రీతిలో పున రావాస కేంద్రానికి కోతులను స్టెరిలైజేషన్‌ కోసం తీసుకురాకపోతుండడం విమర్శలకు తావిస్తోంది.

ఫ రెండేళ్ల నుంచి కేవలం

1,141 స్టెరిలైజేషన్‌లు మాత్రమే

జిల్లా కేంద్ర సమీపంలోని చించోలి వద్ద గల గండి రామన్న హరితవనంలో ఏర్పాటు చేసిన మంకీ రెస్క్యూ అండ్‌ రిహాబిటేషన్‌ సెంటర్‌ (కోతుల పునరావాస కేంద్రం)లో ఇప్పటి వరకు కేవలం 1,141 కోతులకు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు (స్టెరిలైజేషన్‌) చేశారు. ఇక్కడ 2020 డిసెంబరులో కోతుల పునరావాస కేంద్రాన్ని దాదాపు రూ.కోటి వ్యయంతో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో గల కోతుల ను పట్టుకొని ఇక్కడి కేంద్రానికి తీసుకురావాల్సి ఉంది. ఇక్కడ స్టెరిలైజేషన్‌ కాగానే వాటిని తిరిగి అదే ప్రాంతానికి పంపుతారు. ప్రతిరోజూ 20కి పైగా కోతులకు స్టెరిలైజేషన్‌ చేసే సౌకర్యం ఉన్నట్లు పశువైద్యాధికారి తెలిపారు. ఇక్కడి కేంద్రంలో 150కి పైగా కోతులకు స్టెరిలైజేషన్‌ చేసి వారంరోజుల పాటు ఇక్కడే పునరావాసం కల్పించే సౌకర్యం కూడా ఉన్న ట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ఉన్న సౌకర్యాలకు అనుగుణంగా ఇప్పటి వరకు దాదాపు 5వేల నుంచి 10వేల కోతులకు స్టెరిలైజేషన్‌ చేసే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 1,141 కోతులకు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు జరగడం గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందంటున్నారు. జనాలు కోతుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ పాలకవర్గాలు పట్టించుకోకపోతుండడం పట్ల ప్రజలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.

అందరూ చొరవ తీసుకోవాలి

రోజు రోజుకూ అంతటా కోతులసంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కోతులసంఖ్యను తగ్గించాలంటే స్టెరిలైజేషన్‌ ఒక్కటే మార్గం. కోతుల నియంత్రణకు స్టెరిలైజేషన్‌ కోసం గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు మరింత చొరవ తీసుకోవాలి. ప్రస్తుతం విపరీతంగా పెరుగుతున్న కోతులసంఖ్య ఓ సమస్యగా మారింది. సాధారణ ప్రజానీకం, రైతులు కూ డా ఇబ్బందులకు గురవుతున్నారు. ని బంధనల ప్రకారం కోతుల సంఖ్యను నియంత్రించాలంటే ఒక స్టెరిలైజేషన్‌తోనే సాధ్యం. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి కూడా నిర్మల్‌ కేంద్రానికి కోతులను తీసుకువచ్చి స్టెరిలైజేషన్‌ చేయిస్తున్నారు. నిర్మల్‌లో కూడా కొంతమంది కౌన్సిలర్లు తమ ప్రాంతంలోని కోతులను పట్టుకొచ్చి రెస్క్యూసెంటర్‌కు స్టెరిలైజేషన్‌ కోసం తీసుకువస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా మరింత చొరవ తీసుకుంటే సమస్య కొంత వరకైనా తగ్గుతుంది.

- డాక్టర్‌ శ్రీకర్‌రాజు ( పశువైద్యాధికారి, మంకీ రెస్క్యూ రిహాబిటేషన్‌ సెంటర్‌, నిర్మల్‌ )

Updated Date - 2022-12-16T01:32:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising