ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

ABN, First Publish Date - 2022-12-16T22:16:39+05:30

సిర్పూర్‌(టి), డిసెంబరు 16: పది, ఇంటర్మీడియట్‌లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను సందర్శిం చారు. ఈ సందర్భంగా కొద్దిసేపు విద్యార్థులను ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయి

సిర్పూర్‌(టి), డిసెంబరు 16: పది, ఇంటర్మీడియట్‌లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను సందర్శిం చారు. ఈ సందర్భంగా కొద్దిసేపు విద్యార్థులను ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గంట పాటు గణిత పాఠ్యాంశాలు బోధించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపట్టాలని ప్రత్యేకా ధికారి నాగసుధను ఆదేశించారు. కేజీ బీవీ సమీపంలో రెండు కోట్లతో నిర్మి స్తున్న కేజీబీవీ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అదే విధంగా మండల కేంద్రంలో కొనసాగుతున్న మనఊరు మనబడి పనులను పరిశీ లించారు. ఈ నెలాఖరు వరకు క్రీడా ప్రాంగణాలు, పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశిం చారు. జడ్పీ పాఠశాల, సోన్‌పేట, తది తర పాఠశాలల్లో కొనసాగుతున్న మధ్యాహ్న భోజ నంను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలో ఎమ్మెల్యే కోనేరుకోనప్ప ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న మధ్యాహ్న బోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ప్రిన్సిపాల్‌ నాగసుధ, ఎంపీడీవో రాజేశ్వర్‌, ఏఈలు శరత్‌కుమార్‌, డీటీ లలిత, ఎంఆర్‌ఐ ముబీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T22:16:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising