ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి

ABN, First Publish Date - 2022-09-27T03:44:43+05:30

అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉం డాలని, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు పేర్కొన్నారు. సోమవా రం జడ్పీ సమావేశ మందిరం లో స్థాయీ సంఘాల సమా వేశంలో జడ్పీ సీఈవో నరేం దర్‌తో కలిసి పాల్గొన్నారు. కోరం సభ్యులు హాజరు కాకపోవడంతో 2 కమిటీలతో సమావేశాలు సాదాసీదాగా నిర్వహించారు. వ్యవసాయం, మహిళా సంక్షేమం పైనే సమావేశాలు నిర్వహించారు.

స్థాయి కమిటి సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌ పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 26: అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉం డాలని, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు పేర్కొన్నారు. సోమవా రం జడ్పీ సమావేశ మందిరం లో స్థాయీ సంఘాల సమా వేశంలో జడ్పీ సీఈవో నరేం దర్‌తో కలిసి పాల్గొన్నారు. కోరం సభ్యులు హాజరు కాకపోవడంతో 2 కమిటీలతో సమావేశాలు సాదాసీదాగా నిర్వహించారు. వ్యవసాయం, మహిళా సంక్షేమం పైనే సమావేశాలు నిర్వహించారు. లక్షెట్టిపేట జడ్పీటీసీ ముత్తె సత్తయ్య మాట్లా డుతూ ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదని, వ్యవసాయానికి సంబం ధించి కందుల మీద సబ్సిడీ  ఇవ్వడం లేదని నిలదీశారు. ధాన్యం తూకంలో క్విం టాల్‌కు 5 నుంచి  10 కిలోల వరకు ఎందుకు తేడా వస్తుందో తెలపాలన్నారు. మార్కెటింగ్‌ శాఖ అధికారి గజానంద్‌ మాట్లాడుతూ కొనుగోలు సమయంలో ఎటువంటి తేడా జరగడం లేదని, సమస్యలుంటే పరిష్కరిస్తామన్నారు. కందుల  సబ్సిడీని ప్రభుత్వ ఆదేశానుసారం నిర్ణయిస్తామన్నారు.  జిల్లా ఫారెస్టు అధికారి సమావేశాలకు హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం అందించడం లేదని జడ్పీటీసీ సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిపై అధికారులు స్పందించడం లేదని జడ్పీటీసీ సభ్యుడు ముత్తె సత్తయ్య అన్నారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ విత్తనాల సరఫరా, ఆహార భద్రత పథకాల్లో పురోగతి తెలపాలని, అభివృద్ధి పను లలో ఆలస్యం ఎందుకు అవుతుందో తెలపాలన్నారు. 

 జడ్పీ చైర్‌ పర్సన్‌  మాట్లాడుతూ పార్టీలకతీతంగా అభివృద్ధి పనుల్లో అధికా రులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. సమావేశానికి హాజరు కాకపోవడం పరిష్కారం కాదని, దాని వల్ల ప్రజలు నష్టపోతారని, అభి వృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందన్నారు. అధికారులు ప్రభుత్వ పథకాల్లో అల సత్వం ప్రదర్శించవద్దన్నారు. ప్రజలతో మమేకమై జవాబుదారీగా వ్యవహరించ డం అధికారుల బాధ్యత అన్నారు. 

 

Updated Date - 2022-09-27T03:44:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising