ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

ABN, First Publish Date - 2022-07-03T03:45:28+05:30

జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో సంబంధిత శాఖల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించా లని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

వీసీలో పాల్గొన్న కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, జూలై 2: జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో సంబంధిత శాఖల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించా లని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం కలెక్టరే ట్‌లో అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌తో కలసి హరితహారం, క్రీడాప్రాంగణాలు, గ్రామ పంచాయతీ భవనాలు, సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం, తదితర కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన క్రీడామైదానాల కొరకు ఆయామండలాల పరిధిలో భూములు గుర్తించి పనులు వేగవంతం చేయాలని తెలిపారు. అమృత్‌ సరోవర్‌ ఏర్పాటుకోసం ఒకఎకరం విస్తీర్ణానికి తగ్గకుం డా భూమిని గుర్తించాలన్నారు. హరితహారం లక్ష్యాల ను కేటాయించామని, అధికారులు సమన్వయంతో నిర్దే శించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులను పూర్తిస్థాయిలో నిషేధించామన్నారు. అధికారులు పూర్తిస్థాయిలో పర్య వేక్షించాలన్నారు. బాల్యవివాహాల నియంత్రణపై అధి కారులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. వర్షా కాలం సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవ గాహన కల్పించాలని తెలిపారు. డ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. మరమ్మతు పనులను వేగ వంతంగా చేపట్టి ఆగస్టు 15నాటికి ఎలాంటి పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీ ణాభివృద్ధి అధికారి, జిల్లాపంచాయతీ అధికారి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T03:45:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising