ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల నిర్వహణకు నిధులేవీ ?

ABN, First Publish Date - 2022-10-08T03:52:34+05:30

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు నిధుల్లేక ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు పడుతు న్నారు. ఏచిన్న వస్తువు కొనుగోలుకు అయినా సొంతంగా వ్యయం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.

చిన్న బెండార పాఠశాల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఏడాదైనా మంజూరి కాని నిర్వాహణ నిధులు

- ఇబ్బందులు పడుతున్న ప్రధానోపాధ్యాయులు

వాంకిడి, అక్టోబరు 7: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు నిధుల్లేక ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు పడుతు న్నారు. ఏచిన్న వస్తువు కొనుగోలుకు అయినా సొంతంగా వ్యయం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిధులు విడుదల చేయాల్సి ఉండగా పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెలలు కావస్తున్నా నిధులు మంజూరు కాకపోవడంతో ఇబ్బం దులు ఎదుర్కొవాల్సి వస్తోందని ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం 1258పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 908ప్రాథమిక పాఠశాలలు, 180 ప్రాథమికొన్నత పాఠశాలలు, 170 న్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది నుంచి పారిశుధ్య సిబ్బందిని తొలగించడంతో తరగతి గదుల శుభ్రత, మౌళిక వసతుల కోసం సామగ్రి కొనుగోలు చేయడం వంటి పనులు సాగడం లేదు. ప్రాథమిక పాఠశాలల్లో ఖర్చులు తక్కువగా ఉన్నా ఉన్నత పాఠశాలల్లో అధికంగా ఉంటున్నాయి. దీంతో ఇబ్బందులు పడక తప్పడం లేదని హెచ్‌ఎంలు సేర్కొంటున్నారు. 

- మంజూరు కావాల్సింది ఇలా..

 పాఠశాలల్లో 1నుంచి 30మంది విద్యార్థులు ఉంటే రూ.10 వేలు, 30నుంచి 100వరకు రూ.25వేలు, 100నుంచి 250 వరకు రూ. 50వేలు, 250నుంచి 1000 వరకు విద్యార్థులు ఉంటే రూ. 75వేలు ప్రతీ విద్యాసంవత్సరం ప్రభుత్వం అందజేయాల్సి ఉంటుంది. ఈ నిధులతో పాఠశాలల్లో అవసరమైన కాగితాలు, హాజరు పుస్తకాలు, విద్యుత్‌ ఖర్చులకు, అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాదికి సంబంధించిన నిధులు విడుదల కాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు సొంతం గా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. పాఠ శాలల నిర్వహణపై దృష్టి సారించి ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు.  

త్వరలో నిధులు వస్తాయి

 మనుకుమార్‌, ఎంఈవో 

పాఠశాలల నిర్వహణ నిధులపై సమావేశాల్లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలో నిధులు పాఠశాలల ఖాతాల్లో జమ అవుతాయి. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలుగ కుండా పాఠశాలల్లో సామగ్రిని కొనుగోలు చేయాలని ప్రధానో పాధ్యాయులకు సూచించాం.     


Updated Date - 2022-10-08T03:52:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising