ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొమ్మిది మంది Trs నాయకుల సస్పెన్షన్‌

ABN, First Publish Date - 2022-04-13T18:04:32+05:30

చర్ల సొసైటీ చైర్మన్‌ పరుచూరి రవికుమార్‌పై కొద్ది రోజుల క్రితం చర్ల టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యదర్శితో పాటు మరి కొంత మంది దాడి చేసి, గాయపరచిన విషయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సొసైటీ చైర్మన్‌పై దాడి చేసిన ఘటనలో చర్యలు

- పార్టీ కార్యదర్శితోపాటు ఎనిమిది మంది సభ్యత్వం రద్దు

- టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సోయం రాజారావు వెల్లడి


చర్ల(భద్రాద్రి కొత్తగూడెం): చర్ల సొసైటీ చైర్మన్‌ పరుచూరి రవికుమార్‌పై కొద్ది రోజుల క్రితం చర్ల టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యదర్శితో పాటు మరి కొంత మంది దాడి చేసి, గాయపరచిన విషయం తెలిసిందే. తొమ్మిది మంది టీఆర్‌ఎస్‌ నాయకులపై చర్ల పోలీస్‌ స్టేషన్‌లో  కేసులు కూడా నమోదయ్యాయి. కాగా ఈఘటనపై చర్ల టీఆర్‌ఎస్‌ పార్టీ మంగళవారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ మండల కార్యదర్శి నక్కిబోయిన శ్రీనివాస్‌యాదవ్‌, గోసుల మురళి, గోసుల సునీల్‌, యాదాల లక్ష్మి, కొట్టేరు శ్రీనివాస్‌ రెడ్డి, పోలిన లంకరాజు, తోమళ్ళ వరప్రసాద్‌, ముమ్మనేని సత్యసంపన్‌, ఆవుల శ్రీకాంత్‌ లను ఆరు నెలలపాటు పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు సోయం రాజారావు పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆరు నెలల పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నామని ప్రకటించారు. రానున్న రోజుల్లో ఎవరూ దాడులకు పాల్పడకూడదని అందుకే చర్యలు తీసుకున్నామన్నారు. తొమ్మిది మంది టీఆర్‌ఎస్‌ నాయకులను సస్పెండ్‌ చేయడం పై పార్టీలోని కొంత మంది కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరి కాదంటున్నారు.


Updated Date - 2022-04-13T18:04:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising