ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్‌లో న్యూ ఇయర్‌ సందడి

ABN, First Publish Date - 2022-12-31T22:59:28+05:30

ఆసిఫాబాద్‌, డిసెంబరు 31: కొత్త సంవత్సరానికి కొంగొత్త ఆశలతో జిల్లా వాసులు స్వాగతం పలికారు. 2022 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2023కు సుస్వాగతం పలుకుతూ శనివారం అర్ధరాత్రి 12 గంటలకు పట్టణంతోపాటు జిల్లా వ్యాప్తంగా యువత కేరింతలతో న్యూఇయర్‌ వేడుకలను జరుపుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కేకులకు భలే గిరాకీ

- జోరు అందుకున్న మద్యం, మాంసం విక్రయాలు

- ఆనందోత్సవాల్లో మునిగితేలిన యువత

ఆసిఫాబాద్‌, డిసెంబరు 31: కొత్త సంవత్సరానికి కొంగొత్త ఆశలతో జిల్లా వాసులు స్వాగతం పలికారు. 2022 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2023కు సుస్వాగతం పలుకుతూ శనివారం అర్ధరాత్రి 12 గంటలకు పట్టణంతోపాటు జిల్లా వ్యాప్తంగా యువత కేరింతలతో న్యూఇయర్‌ వేడుకలను జరుపుకున్నారు. న్యూఇయర్‌ వేడుకులను ఆనందోత్సవాల మధ్య జరుపు కునేందుకు యువత డీజేపాటలతో నృత్యాలు చేశారు. పట్టణంలోని పలుచోట్ల కేకుల దుకాణాలు వెలిశాయి. కేకులను కొనుగోలు చేసేందుకు బేకరీల వద్ద యువత, విద్యార్థుల సందడి కనిపించింది. రంగురంగుల ముగ్గులను లోగిళ్లలో వేసేం దుకు మహిళలు యువతులు రంగులను కొనుగోలు చేశారు. అలాగే మద్యం, మాంసం విక్రయాలు కూడా జోరుగా సాగాయి. న్యూఇయర్‌ వేడు కల్లో భాగంగా యువకులు పార్టీలు జరుపుకోవడానికి మద్యం దుకాణాలకు క్యూ కట్టారు. దీంతో మద్యం షాపుల వద్ద సందడి కనిపించింది. న్యూ ఇయర్‌ వేడుకల్లో ఎలాంటి అపశృ తులు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. ఆసిఫా బాద్‌, కాగజ్‌నగర్‌ పోలీసు సబ్‌డివిజన్‌ పరిధిలోని డీఎస్పీలు శ్రీనివాస్‌, కరుణాకర్‌ల ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు బందో బస్తు నిర్వ హించారు.

సిర్పూర్‌(టి): మండలంలో నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. నూతన సంవత్సరాన్ని స్వాగతం పలికేందుకు కేకులు కొనుగోలు చేసేందుకు దుకాణాలు, బేకరీలవద్ద యువత సందడి కనిపింది.

ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు కేకులకు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే అర్ధరాత్రి దాటాక యువ కులు కేరింతలు కొడుతూ నూతన సంవ త్సరానికి స్వాగతం పలికారు.

Updated Date - 2022-12-31T22:59:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising