ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విపత్కర పరిస్థితుల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సేవలు అమోఘం

ABN, First Publish Date - 2022-12-15T01:57:13+05:30

విపత్కర పరిస్థితుల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సేవ అమోఘమని అదనపు కలెక్టర్లు హే మంత్‌ బోర్కడే, రాంబాబు అన్నారు.

ప్రజలను కాపాడే పద్ధతులనుచూపిస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ టౌన్‌, డిసెంబరు 14 : విపత్కర పరిస్థితుల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సేవ అమోఘమని అదనపు కలెక్టర్లు హే మంత్‌ బోర్కడే, రాంబాబు అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల ఎన్‌సీసీ యూనిట్‌, అగ్నిమాపక దళం సంయుక్తంగా అవగాహన శిక్షణా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. రసా యన, జీవ, రేడియోధార్మిక, అణు సంబంధిత విపత్తు లను ఎదుర్కొనే సందర్భంలో నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పా న్స్‌ ఫోర్స్‌ ప్రజలను కాపాడే పద్ధతులను ప్రత్యక్షంగా తమ బృందం ద్వారా ప్రయోగాత్మకంగా చూపించారు. భూకంపాలు, తుఫాన్లు లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు పాటించవలసిన పద్ధతులను వివరించారు. సీపీఆర్‌ లాంటి పద్ధతుల ద్వారా ప్రజల ప్రాణాలను ఎలా కాపాడవచ్చో చూపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే మాట్లాడుతూ... విపత్కర పరిస్థితుల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సేవ అమోఘమని, ప్రపంచంలోనే ఉత్తమదళం మనదేశంలో ఉండడం మనకు గర్వకారణంగా ఉంటుందన్నారు. ఈ కార్య క్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జే. భీమా రావు, నిర్మల్‌ ఆర్డీవో స్రవంతి, నిర్మల్‌ తహసీల్దార్‌ సుభా ష్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కమాండర్‌ దామోదర్‌సింగ్‌, గోపాల్‌ మీనా, గౌతమ్‌, వివిధ కళాశాలల, పాఠశాలల విద్యా ర్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T01:57:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising