ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర ప్రభుత్వ కుట్రకు వ్యతిరేకంగా పోరాడాలి

ABN, First Publish Date - 2022-03-06T03:49:16+05:30

ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీలో వాటాల ఉపసంహరణకు కుట్రలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. శనివారం ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా శిభిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 యేండ్లుగా ప్రభుత్వ రంగ సంస్థగా ఎల్‌ఐసీ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తుం దని, వాటాల ఉపసంహరణ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

దీక్ష శిబిరంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి  5 : ప్రభుత్వ  రంగ సంస్థ ఎల్‌ఐసీలో వాటాల ఉపసంహరణకు కుట్రలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని ఎమ్మెల్యే  నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. శనివారం ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా శిభిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 యేండ్లుగా ప్రభుత్వ రంగ సంస్థగా ఎల్‌ఐసీ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తుం దని,  వాటాల ఉపసంహరణ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎల్‌ఐసీ, రైల్వే లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబె ట్టేందుకు ప్రయత్నించడం దేశ ప్రజల ప్రయోజ నాల పై ప్రభావం ఉంటుందన్నారు. మేధావులు, ఆర్థికవే త్తలు ఐక్యంగా ఉద్యమించి మోదీ సర్కారుపై పోరా టం  చేయాలన్నారు. మున్సిపల్‌  చైర్మన్‌ రాజయ్య, వైస్‌చైర్మన్‌ ముఖేష్‌గౌడ్‌, ఐపీవో  అసోసియేషన్‌ అధ్య క్షుడు తిరుపతిరెడ్డి, రాజు, సీఐటీయూ, సీపీఐ నాయకులు సంకె రవి, శ్రీనివాస్‌, జైపాల్‌, దేవి సత్యం,  లక్ష్మణ్‌, మేకల దాసు, శ్రీధర్‌, రాజ్‌కుమార్‌, రమేష్‌ బాబు, లింగమూర్తి, శ్రీనివాస్‌, గోపికృష్ణ,మౌనిక, సుష్మ, పాల్గొన్నారు.   

Updated Date - 2022-03-06T03:49:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising