ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో ఘనంగా మొహర్రం

ABN, First Publish Date - 2022-08-10T04:25:30+05:30

జిల్లాలోని పలు చోట్ల మంగళవారం మొహర్రం పండుగను ఘనంగా నిర్వహించారు.

పెంచికలపేటలో పీరీలతో ఊరేగింపు నిర్వహిస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాంకిడి, ఆగస్టు 9: జిల్లాలోని పలు చోట్ల మంగళవారం మొహర్రం పండుగను ఘనంగా నిర్వహించారు. వాంకిడి మండలంలోని ఖమన, వాంకిడి, తదితర గ్రామాల్లో   ప్రజలు పీరీల బంగ్లాల వద్ద నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం  పీరీలను గ్రామ వీధుల్లో ఊరేగించి సమీప చికిలి వాగులో నిమజ్జనం చేశారు. 

పెంచికలపేట: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మొహర్రం సందర్భంగా అన్ని కాలనీల్లో పీరీలతో ఊరేగింపు నిర్వహించారు. వేడుకల్లో కుల మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారు. 

చింతలమానేపల్లి: మండల కేంద్రంతో పాటు గూడెం, కర్జవెల్లి, గంగాపూర్‌ తదితర గ్రామాల్లో మొహర్రం పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రజలు పీరీల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. 

దహెగాం: మండల వ్యాప్తంగా మొహర్రం పండుగను ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ మత సామరస్యాలకు అతీతంగా ఈ వేడుకలు నిలుస్తాయని కొనియాడారు.

కెరమెరి: మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో మొహర్రం పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ అబ్దుల్‌ కలాం, సంతోష్‌, రాజయ్య, కృష్ణ, శంకర్‌, సంతోష్‌, సాగర్‌, శంకర్‌, వెంకటి, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

సిర్పూర్‌(టి): మండల కేంద్రంతో పాటు చిర్రకుంట, అచ్చెల్లి, మండల కేంద్రంలోని చాకలివాడ తదితర ప్రాంతాల్లో కులమతాలకు అతీతంగా మొహర్రం పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముస్లింలు షరబత్‌ను పంపిణీ చేశారు. 

Updated Date - 2022-08-10T04:25:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising