ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం

ABN, First Publish Date - 2022-05-23T03:52:26+05:30

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ రేట్లను భారీగా తగ్గించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం ఆసిఫాబాద్‌ పట్టణంలో బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ పెట్రోల్‌పై రూ.9.50, డీజీల్‌పై రూ.7 తగ్గించడమే కాకుండా గ్యాస్‌ మీద రూ.200 ధరలను తగ్గించారని చెప్పారు.

ఆసిఫాబాద్‌లో మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌ రూరల్‌, మే 22: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ రేట్లను భారీగా తగ్గించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం ఆసిఫాబాద్‌ పట్టణంలో బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ పెట్రోల్‌పై రూ.9.50, డీజీల్‌పై రూ.7 తగ్గించడమే కాకుండా గ్యాస్‌ మీద రూ.200 ధరలను తగ్గించారని చెప్పారు. అలాగే ప్లాస్టిక్‌, సిమెంట్‌, స్టీల్‌ రేట్లపై ట్యాక్స్‌ తగ్గించి సామాన్యులపై భారాన్ని తగ్గించిందన్నారు. ధరలను తగ్గించేందుకు సహసోపేత నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆత్మారాంనాయక్‌, కాండ్రె విశాల్‌, ఆంజనేయులుగౌడ్‌, సతీష్‌బాబు, నవీన్‌గౌడ్‌, ఓదేలు, శ్రీనివాస్‌, సుధాకర్‌, కార్తీక్‌, అశోక్‌, గణపతి, వసంత్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

రెబ్బెన: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ రేట్లను భారీగా తగ్గించడంపై హర్షం వ్యక్తం చేస్తూ  మండలం లోని గోలేటిలో బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆంజనేయులుగౌడ్‌, బాలకృష్ణ, ఓదేలు, నవీన్‌గౌడ్‌, సురేష్‌, మహేందర్‌, ప్రశాంత్‌, తులసిరాం తదితరులు పాల్గొన్నారు. 

కెరమెరి: మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు చందు, శ్రీకాంతచారి, శ్రీనివాస్‌, లక్ష్మణ్‌, కూనల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T03:52:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising