కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
ABN, First Publish Date - 2022-01-29T04:24:28+05:30
టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో గురువారం సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కలిశారు. కుమరం భీం జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో కోనప్పను మంత్రి శాలువ కప్పి అభినందించారు.
కాగజ్‌నగర్, జనవరి 28: టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో గురువారం సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కలిశారు. కుమరం భీం జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో కోనప్పను మంత్రి శాలువ కప్పి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనపై నమ్మకం పెట్టి జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు రుణపడి ఉంటానన్నారు. జిల్లాలో టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లో మరింతగా చేరేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని, పార్టీని బలోపేతం చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
Updated Date - 2022-01-29T04:24:28+05:30 IST