ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2022-08-13T04:21:57+05:30

ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని గొల్లపల్లి, కొండాపూర్‌, బుద్దిపెల్లి గ్రామాల్లో వర్షాలకు పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో శుక్రవారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. కడెం డిస్ర్టిబ్యూటర్‌ 46 నెంబరు కాలువ ద్వారా దొనబండ చెరువుకు వచ్చే కాలువ తెగిపోగా సుమారు 60 ఎకరాల్లో ఇసుకమేటలు వేశాయి. కడెం డీఈతో మా ట్లాడి కాలువకు మరమ్మతు చేయించాలని సూచిం చారు.

బుద్దిపెల్లి గ్రామంలో ఇసుక మేట వేసిన పొలాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాజీపూర్‌, ఆగస్టు 10 : ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని గొల్లపల్లి, కొండాపూర్‌, బుద్దిపెల్లి గ్రామాల్లో వర్షాలకు  పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో శుక్రవారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. కడెం డిస్ర్టిబ్యూటర్‌ 46 నెంబరు కాలువ ద్వారా దొనబండ చెరువుకు వచ్చే కాలువ తెగిపోగా సుమారు 60 ఎకరాల్లో  ఇసుకమేటలు వేశాయి. కడెం డీఈతో మా ట్లాడి కాలువకు మరమ్మతు చేయించాలని సూచిం చారు. పెద్దంపేట, దొనబండ గ్రామాల్లో లైన్‌మెన్‌ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, అతన్ని తొలగించాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు. దొనబం డ-పెద్దంపేట మార్గంలో వంతెనపై గుంత ఏర్పడి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, గుం తను పూడ్చాలని విన్నవించారు. సర్పంచులు జాడి సత్యం, మధుసూదన్‌రెడ్డి, ఎంపీటీసీ జాడి వెంకటేష్‌, నాయకులు బేతు రవి, అల్లం నాగయ్య, అంబటయ్య, కొమురయ్య, రైతులు పాల్గొన్నారు. 

అనంతరం ముల్కల ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీలను ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రారంభించారు. కబడ్డీ, వాలీబాల్‌ ఆడి యువకులను ఉత్సాహ పరిచారు. ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌,  సర్పంచు శ్రీనివాస్‌, నాయకులు కుడుక సత్యం, చంద్రయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. 

ప్రాణహిత ముంపు ప్రాంతంలో

కోటపల్లి: ప్రాణహిత బ్యాక్‌వాటర్‌తో నీట మునిగిన పంటలను శుక్రవారం అధికారులు, నాయకులు పరిశీ లించారు. అన్నారం, జనగామ, ఆల్గామ, పుల్లగామ గ్రామాల్లోని వరద ముంపుతో పంటలు దెబ్బతిన్నాయి. నీట మునిగిన పంటలను పరిశీలించిన అధికారులు, నాయకుల బృందం జరిగిన నష్టంపై ఎమ్మెల్యేకు వివ రిస్తామన్నారు. తహసీల్దార్‌ సునీల్‌కుమార్‌, ఎంపీడీవో భాస్కర్‌, ఎస్‌ఐ వెంకట్‌, వైస్‌ ఎంపీపీ వాలా శ్రీని వాసరావు, సింగిల్‌ విండో చైర్మన్‌ సాంబగౌడ్‌,  ఏఈవో లు అనూష, వైష్ణవి, నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-13T04:21:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising