ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజారోగ్యంపై వైద్యసిబ్బంది ప్రత్యేకదృష్టి పెట్టాలి

ABN, First Publish Date - 2022-06-25T06:43:12+05:30

ప్రజారోగ్యంపై వైద్యాధికారులు, సిబ్బంది ప్రత్యేకదృష్టి పెట్టి మెరుగైన వైద్యం అందించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి సూచించారు.

మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి

నిర్మల్‌ కల్చరల్‌, జూన్‌ 24 : ప్రజారోగ్యంపై వైద్యాధికారులు, సిబ్బంది ప్రత్యేకదృష్టి పెట్టి మెరుగైన వైద్యం అందించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి సూచించారు. శుక్రవారం ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఆసుపత్రి ప్రమాణాలు పాటించడంలో జాతీయస్థాయి గుర్తింపు పొందడం అభి నందనీయమని అన్నారు. ఇదంతా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారుల ప్రత్యేకశ్రద్ధతోనే సాధ్యమైందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలను అందిస్తున్నారని ప్రశంసించారు. కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ మాట్లా డుతూ... ప్రసూతి, ప్రధాన ఆసుపత్రులు ఎన్‌కాష్‌ సర్టిఫికెట్‌కు అర్హత సాధిం చడం అభినందనీయమన్నారు. 94 శాతంతో మొదటిర్యాంక్‌ సాధించిందని తెలిపారు. కేంద్రబృందం మూడురోజులు పర్యటించి రోగులకు అందిస్తున్న సేవలు, వసతులు ఇతరత్రా పరిశీలించి సర్టిఫికెట్‌ కోసం ఎంపిక చేశారన్నారు. దీనితో జిల్లాకు ఏడాదికి రూ.15 లక్షల నిధులు మంజూరవుతాయన్నారు. వైద్యు లు అందిస్తున్న సేవలను కలెక్టర్‌ అభినందించారు. అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, సూపరెండెంట్‌ దేవేందర్‌రెడ్డి, డాక్టర్‌ రజిని, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. 

నిర్మల్‌ మండల సమావేశం

నిర్మల్‌ రూరల్‌, జూన్‌ 24 :  మండల సమావేశం శుక్రవారం నిర్మల్‌ మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయా శాఖల అధికారులు మాట్లాడుతూ... వర్షా కాలం జూన్‌ మాసం 28వ తేదీ వరకు రైతుబంధు ప్రతీ ఒక్క రైతుఖాతాల్లో జయ చేయడం జరుగుతుందన్నారు. రైతులు చిరుధాన్యాలు పండించాలన్నారు. అలాగే హరితహారంలో భాగంగా వర్షాకాలంలో చెట్లను పెంచే కార్యక్రమాన్ని నిర్వహించాలని సభాముఖంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంఆర్‌వో, అగ్రికల్చర్‌, ఆయాశాఖ అధికారులు, వైస్‌ ఎంపీపీ, నాయకులు వి లాస్‌, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-25T06:43:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising