ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు: జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి

ABN, First Publish Date - 2022-11-28T22:19:38+05:30

కాగజ్‌నగర్‌, నవంబరు 28: విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నట్టు జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. కాగజ్‌నగర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన 50వ జిల్లాస్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాగజ్‌నగర్‌, నవంబరు 28: విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నట్టు జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. కాగజ్‌నగర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన 50వ జిల్లాస్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం విద్యార్థునుద్దేశించి మాట్లాడారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న జిజ్ఙానసను వెలికి తీసేందుకు సైన్స్‌ ఎగ్జిబిషన్స్‌ ఎంతగానో దోహదపడుతాయన్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ ఇంటర్‌విద్యార్థులకు ఉచితమధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయటంతో రాష్ట్రంలోనే చక్కటి ర్యాంకులు కాగజ్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు వచ్చినట్టు తెలిపారు. చక్కగా రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకరావాలని కోరారు. అదనపుకలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో విద్యార్థులు ప్రతిభ కనబర్చాలన్నారు. సమాజానికి ఉప యోగపడేవిధంగా ఆవిష్కరణలు చేయాలన్నారు. డీఈవో ఆశోక్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో సహజంగా ఉండే సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి వేదికలు చక్కగా ఉపయోగపడుతాయన్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 300మంది విద్యార్థులు పాల్గొన్నట్టు తెలిపారు. సైన్స్‌ ప్రదర్శనలో పలు పాఠశాల విద్యార్థులు నూతన ఆవిష్కరణలు ప్రదర్శిం చగా అవి అందరినీ ఆకట్టుకున్నాయి.

Updated Date - 2022-11-28T22:19:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising