ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు

ABN, First Publish Date - 2022-05-21T05:33:48+05:30

గాంధీ పార్కుకు వచ్చే ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌,మే20: గాంధీ పార్కుకు వచ్చే ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌ అన్నారు. శుక్రవారం గాంధీ పార్కును సందర్శించి ఇక్కడి వసతులు, నర్సరీలను పరిశీలించారు. చిన్నారుల కోసం ఏర్పాటు ఆట వస్తువులను పరిశీలించి వాటిని మరమ్మతులు లేదా కొత్తవాటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గాంధీ పార్కును అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జూన్‌ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పట్టణ ప్రగతిలో నిధులను మంజూరు చేసుకుని పనులను చేపడతామన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు వర్షకాలంలో హరితహారంలో అత్యధికంగా మొక్కలు నాటేలా కార్యచరణను రూపొందిస్తున్నామన్నారు. దానికి అనుగుణంగానే నర్సరీల్లో మొక్కలను అందుబాటులో ఉంచేలా అధికారులకు సూచనలు చేశామని స్పష్టం చేశారు.ఆయనతో పాటు మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ ఏఈ అరుణ్‌కుమార్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-05-21T05:33:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising