ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యథేచ్ఛగా కబ్జా...!

ABN, First Publish Date - 2022-10-18T03:20:13+05:30

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూముల కబ్జా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఖాళీగా స్థలం కనిపిస్తే చాలు కబ్జాదారులు గద్దల్లా వాలిపోతున్నారు. కోట్ల విలువైన భూముల్లో రాత్రికి రాత్రే శాశ్వత కట్టడాలు వెలుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువ య్యాడు. ప్రభుత్వ స్థలాలతోపాటు నాలాలు, వాగులు, వంకలు, చెరువు శిఖం భూములు అధికారుల ఉదాసీనతతో కబ్జాకు గురవుతున్నాయి.

శ్రీనివాస టాకీస్‌ రోడ్డులో ప్రభుత్వ స్థలంలో వెలిసిన నిర్మాణం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూములు హాంఫట్‌

శాశ్వత కట్టడాలు వెలుస్తున్నా పట్టించుకోని అధికారులు  

కలెక్టర్‌కు కౌన్సిలర్‌ ఫిర్యాదు  

మంచిర్యాల, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూముల కబ్జా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఖాళీగా స్థలం కనిపిస్తే చాలు కబ్జాదారులు గద్దల్లా వాలిపోతున్నారు. కోట్ల విలువైన భూముల్లో రాత్రికి రాత్రే శాశ్వత కట్టడాలు వెలుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువ య్యాడు. ప్రభుత్వ స్థలాలతోపాటు నాలాలు, వాగులు, వంకలు, చెరువు శిఖం భూములు అధికారుల ఉదాసీనతతో కబ్జాకు గురవుతున్నాయి. గతంలో పట్టణ శివారు ప్రాంతాల్లో కబ్జాలు జరిగేవి. ఇటీవల పట్టణ నడి బొడ్డున కూడా కబ్జాల పరంపరకు తెరతీశారు. భూములను ఆక్రమించి అనధికారికంగా నిర్మాణాలు చేపట్టినా అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. మున్సిపల్‌ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కొందరు కౌన్సిలర్లు  కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో కబ్జాల బాగోతం వెలుగుచూసింది.  

ప్రధాన సెంటర్‌లో ఆక్రమణ

పట్టణ నడిబొడ్డున ఉన్న పరంపోగు స్థలాన్ని చేజిక్కించుకునేందుకు అందులో శాశ్వత నిర్మాణం చేపట్టారు. శ్రీనివాస టాకీస్‌ రోడ్డులో ఫ్లైఓవర్‌ బ్రిడ్జి సమీపంలో ఖాళీ స్థలాన్ని ఇటీవల కొందరు కబ్జా చేసి అందులో శాశ్వత నిర్మాణం చేపట్టారు.  సర్వే నంబర్‌  87ఈపీ(పరంపోగు) భూమి కావడంతో అధికారుల కండ్లు కప్పి ఏకంగా భవన నిర్మాణం చేపట్టడం చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం అక్కడ గజం లక్ష రూపాయల పైనే ధర పలుకుతోంది. గతంలో ఆ స్థలంలో ఓ మెకానిక్‌ షెడ్‌ ఉండేది. తాత్కాలికంగా అందులో వాహనాల సర్వీసింగ్‌ సెంటర్‌ నిర్వహించే వారు. మెకానిక్‌ షెడ్‌ ఎత్తివేయగా దానిని ఆనుకొని ఉన్న ఓ వ్యక్తి ఆ స్థలంపై కన్నేశాడు. రాత్రికి రాత్రే బయటకు కనిపించకుండా రోడ్డు వెంట పరదాలు కట్టి శాశ్వత భవన నిర్మాణాన్ని చేపట్టాడు. ప్రస్తుతం భవన నిర్మాణం చివరి దశకు చేరుకొంది. అయినా అధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం. 

వ్యాపారుల హస్తగతం

జిల్లా కేంద్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో భూ కబ్జాలు కూడా పెరిగిపోతున్నాయి. రైల్వేస్టేషన్‌ మొదలుకొని ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వరకు   87 సర్వే నంబర్‌లో పరంపోగు స్థలం వందల ఎకరాలు ఉంది.  మెయిన్‌ రోడ్డు వెంట రోడ్డుకు ఇరువైపులా స్థలాన్ని కబ్జా చేసిన బడా వ్యాపారులు ఏకంగా అందులో బహుళ అంతస్థుల శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. ఏకంగా భవన నిర్మాణాలు చేపట్టినా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దశాబ్దాల క్రితం స్థలాలు కబ్జా కాగా ఇప్పటి వరకు వాటికి ఎలాంటి హక్కు పత్రాలు లేకపోవడం గమనార్హం. 30, 40 సం వత్సరాల క్రితమే కబ్జాలకు గురైనందున వాటి  గురించి పట్టించుకోకుండా వదిలివేశారు. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యక్తి ఒకరు ఓవర్‌ బ్రిడ్జి  వద్ద ఇటీవల భవన నిర్మించడం గమనార్హం. ఇలా వందలాది  ఎకరాల  పరం పోగు భూములు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. 

కలెక్టర్‌కు ఫిర్యాదుతో వెలుగులోకి

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందని, దానిని కాపాడాలని   కౌన్సిలర్‌ రామగిరి భానేష్‌ సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సర్వే నంబర్‌  87లోని సుమారు 70 చదరపు గజాల పరంపోగు భూమిని ఓ వ్యాపారి కబ్జా చేసినట్లు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సదరు స్థలాన్ని గతంలో పబ్లిక్‌ టాయిలెట్‌ నిర్మాణా నికి కేటాయించాలని నిర్ణయించారు. మున్సిపల్‌ అధికారులు నిర్మాణం చేపట్టకపోవడంతో స్థలం ఖాళీగా ఉండడంతో కబ్జాదారుల కన్ను పడింది. సదరు స్థలం విలువ కనీసం రూ.50 లక్షలు ఉంటుందని సమాచారం. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.    

Updated Date - 2022-10-18T03:20:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising