ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో ఆలయాలకు మహర్దశ

ABN, First Publish Date - 2022-05-28T07:01:38+05:30

తెలంగాణ ప్రభుత్వంతోనే ఆలయాలకు మహర్దశ వ చ్చిందని అటవీ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి అల్లోల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మామడ, మే 27 : తెలంగాణ ప్రభుత్వంతోనే ఆలయాలకు మహర్దశ వ చ్చిందని అటవీ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రోజున మామడ మండలంలోని రాసిమెట్ల గ్రామంలో ఇటీవల నిర్మించిన భీమన్న ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్నారు. భీమన్నస్వామికి పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ, గ్రామస్థులు ఘనంగా స్వాగతం తెలిపారు. అనంతరం వాస్తపూర్‌ సర్పంచ్‌ సంతోష్‌ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవాలాల్‌ జగదాంబ ఆలయం లో పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ప్రతిగ్రామంలో ఆల యం నిర్మాణం వల్లనే ఆధ్యాత్మికతతోనే ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్‌ రామ్‌కిషన్‌రెడ్డి, గాయద్‌పల్లి సర్పంచ్‌ రాందాస్‌, టీఆర్‌ ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్‌, రైతుసమితి మండల అధ్య క్షుడు గంగారెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ భాస్కర్‌రావు, కే. భాస్కర్‌, తది  తరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-28T07:01:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising