ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూ వెల్మల్‌లో అట్టహాసంగా లక్ష్మివేంకటేశ్వర ప్రతిష్ఠాపన ఉత్సవాలు

ABN, First Publish Date - 2022-05-24T05:49:23+05:30

మండలంలోని న్యూవెల్మల్‌ గ్రామంలో సోమవారం లక్ష్మి వేంకటేశ్వరస్వామి, ఇతర దేవతామూర్తుల ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమం అట్ట హాసంగా ప్రారంభమైంది.

న్యూ వెల్మల్‌లో స్వామివారి విగ్రహాలతో శోభాయాత్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళహారతులతో హాజరైన మహిళలు 

భక్తులకు అన్నదానం

సోన్‌, మే 23 : మండలంలోని న్యూవెల్మల్‌ గ్రామంలో సోమవారం లక్ష్మి వేంకటేశ్వరస్వామి, ఇతర దేవతామూర్తుల ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమం అట్ట హాసంగా ప్రారంభమైంది. లక్ష్మివేంకటేశ్వర విగ్రహాలతో పాటు ఇతర దేవతా మూర్తులు ఆండాలమ్మ, భగవత్‌ రామానుజులు, లక్ష్మినరసింహస్వామి, తది తర విగ్రహాలను గ్రామంలో మంగళవాయిద్యాలు, మహిళ మంగళహారతులతో ఊరేగించారు. తొలిరోజు పుణ్యావాచనము, హోమకార్యక్రమాలతో పాటు జలాన్యాస కార్యక్రమాలు జరిపారు. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్రం మంత్రి వేణుగోపాలచారి, గ్రామ సర్పంచ్‌ అంకం గంగమణి శ్రీనివాస్‌, గ్రామపెద్దలు మనోహర్‌రావు, కిరణ్‌రావు, మాజీ సర్పంచ్‌ దత్తాత్రి, తదితరులు హాజరు కాగా గ్రామ ప్రజలతో పాటు సమీప గ్రామాల నుంచి ప్రతిష్ఠాపన తొలిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మూడురోజుల పాటు ప్రతిష్ఠాపనోత్సవాలు జరుగనున్నాయి. గురువారం నాడు వేంకటేశ్వరస్వామితో పాటు ఇతర దేవతా మూర్తుల విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్‌రెడ్డి, తదితర ప్రముఖులు హాజరు కానున్నట్లు ప్రతిష్ఠాపన కమిటీ సభ్యులు తెలిపారు. 

Updated Date - 2022-05-24T05:49:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising