ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీఆర్‌ఎస్‌కు స్పందన కరువు....!

ABN, First Publish Date - 2022-08-05T04:03:01+05:30

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కార్మికులను తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక మాంద్యం నుంచి బయట పడేందుకు యాజమాన్యం రూపొందించిన ప్రణాళిక ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఉద్యోగులను తగ్గించుకునేందుకు ఆర్టీసీ యాజమా న్యం వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీం (వీఆర్‌ఎస్‌)ను ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వ ప్రకటనపై విశ్వాసం లేని కార్మికులు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రానట్లు తెలుస్తోంది.

మంచిర్యాల ఆర్టీసీ డిపో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్టీసీలో ముందుకు రాని కార్మికులు  

జిల్లాలో కేవలం 11 మంది దరఖాస్తు

సర్క్యులర్‌లో స్పష్టత లేకపోవడమే కారణం  

మంచిర్యాల, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ  రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కార్మికులను తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక మాంద్యం నుంచి బయట పడేందుకు యాజమాన్యం రూపొందించిన ప్రణాళిక ఆశించిన   ఫలితాలు ఇవ్వలేదు. ఉద్యోగులను తగ్గించుకునేందుకు ఆర్టీసీ యాజమా న్యం వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీం (వీఆర్‌ఎస్‌)ను ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వ ప్రకటనపై విశ్వాసం లేని కార్మికులు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రానట్లు తెలుస్తోంది. ఇప్పటికే గడ్డు పరిస్థితు లను ఎదుర్కొంటున్న కార్మికులు ఉన్న ఉపాధిని సైతం కోల్పోవడం ఇష్టం లేక వీఆర్‌ఎస్‌ పథకాన్ని తిరస్కరించినట్లు కార్మికుల్లో చర్చ జరుగుతోంది.

కార్మికుల్లో సందేహాలెన్నో...

ఆర్టీసీ యాజమాన్యం వీఆర్‌ఎస్‌ ప్రకటించినప్పటికి అనేక సందేహాల కారణంగా కార్మికులు దరఖాస్తుకు ముందుకు రాలేదని తెలుస్తోంది.  వీఆర్‌ఎస్‌కు  దరఖాస్తు చేసుకుంటే రిటైర్‌మెంట్‌ తర్వాత వచ్చే బెనిఫి ట్‌లు, ఇతర లావాదేవీలు సకాలంలో అందుతాయో లేదోనన్న మీమాంస లో కార్మికులు ఉండడంతో ఆశించిన మేర దరఖాస్తులు రాలేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ఆర్టీసీ కార్మికులకు చెల్లిస్తున్న జీతభత్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయినా ఉచిత రవాణాతోపాటు వైద్య సదుపాయాలు సమకూరుతున్నాయనే ఉద్దేశంతో సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వీఆర్‌ఎస్‌ కోసం ముందుకు వెళ్తే పదవీ విరమణ అనంతరం వెంటనే నగదు చెల్లిస్తారా లేదా మళ్లీ ఏదైనా బాండు రూపంలో అందజేస్తారా అనే సందేహం కార్మికుల్లో నెలకొంది. అలాగే డీఏ, ఏరియర్స్‌ పైన స్పష్టత లేకపోవడంతో కార్మికులు ఆలోచనలో పడినట్లు సమాచారం. వీఆర్‌ఎస్‌ కోసం రూపొందించిన సర్క్యులర్‌ లోపబూయిష్టంగా ఉండడంతో పదవీ విరమణ పొందిన అనంతరం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని కార్మికులు స్తబ్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వీఆర్‌ఎస్‌కు 11 మంది దరఖాస్తు....

ఆర్టీసీలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందేందుకు నిర్ణీత గడువు జూలై 31లోపు కేవలం 11 మంది కార్మికులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లాలో ఒకే ఒక డిపో ఉండగా దాని పరిధిలో 551 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ యాజ మాన్యం 20 ఏళ్ల సర్వీస్‌ ఉన్న వారికే దరఖాస్తు చేసుకోవడానికి  అవకాశం కల్పించింది. వీఆర్‌ఎస్‌ తీసుకున్న రోజు వరకు అర్హత ఉన్న వారికి గ్రాట్యూటీతో పాటు వడ్డీ కలిపి చెల్లిస్తామని యాజమాన్యం ప్రకటించింది. అలాగే ఉద్యోగ విరమణ పొందిన వారికి జిల్లా సర్వీసులలో డీలక్స్‌ కేటగిరీ వరకు ఉచిత ప్రయాణ అవకాశాన్ని కల్పించింది. 2013 వేతన సవరణకు సంబంధించి బకాయి ఉన్న బాండ్స్‌ మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించనున్నట్లు యాజమాన్యం పేర్కొంది. వేతన సవరణ బకాయి  మొత్తాన్ని వడ్డీతో చెల్లిస్తామని యాజమాన్యం చెబుతున్నా కార్మికులకు ఉన్న సందేహాలు నివృత్తి కావడం లేదు. 2017, 2021 రెండు వేతన  సవరణలపై ఎటూ తేల్చకపోవడంపై కార్మికుల్లో అనుమానాలు రేకెత్తు తున్నాయి. అలాగే పదవీ విరమణ పొందిన తర్వాత వైద్య సౌకర్యం కల్పిస్తారో లేదోననే అనుమానంతో వీఆర్‌ఎస్‌ తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. 

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు స్వస్తి.... 

ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోవడంతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు యాజమాన్యం ఇప్పటికే స్వస్తి పలికింది. అలాగే  సంస్థలో అదనంగా ఉన్న సిబ్బందిని వివిధ పనులకు కేటాయించారు. ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్న సెక్యురిటీ గార్డులు, అటెండర్లు, ట్రాఫిక్‌ గైడ్‌లు, పార్కింగ్‌ గైడ్‌లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, బస్‌ పాస్‌ కౌంటర్లలో  ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను సంస్థ ఇప్పటికే తొలగించింది. సంస్థలో అదనంగా ఉన్న సిబ్బందిని గతంలో పురమాయిం చిన పనులకు భిన్నంగా ఇతరత్రా పనులు కేటాయించారు. దీంతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్ధకం కాగా వీఆర్‌ఎస్‌తో ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు యాజమాన్యం శ్రీకారం చుట్టింది. యాజమాన్యం చర్యల ద్వారా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఉపాధికి దూరం కాగా పర్మనెంట్‌ కార్మికులను కూడా తొలగించే పనిలో నిమగ్నమైంది.   

వైద్య సౌకర్యంపై అనుమానాలు

వి.భీమేశ్వర్‌రావు, ఆర్టీసీ రీజనల్‌ కార్యదర్శి, ఎంప్లాయీస్‌ యూనియన్‌  

వీఆర్‌ఎస్‌కు వెళితే ఉద్యోగానంతరం ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు  వైద్య సౌకర్యం కల్పిస్తుందో లేదోననే అనుమానం ఉంది. సర్క్యులర్‌లో కూడా ఉద్యోగ విరమణ పొందే వారికి చెల్లించే బెనిఫిట్‌లపై స్పష్టత ఇవ్వలేదు. గతంలో కార్మికులకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ కార్పొరేట్‌ ఆసుపత్రిలో వైద్య సేవలు అందేవి.  ప్రస్తుతం కొనసాగిస్తారా లేదా అనే సందేహం నెలకొంది. పే స్కేల్‌, ఏరియర్స్‌ విషయమై స్పష్టత లేదు. పదవీ విరమణ అనంతరం కార్మికులకు చెల్లించే నగదుపై  అయోమయం నెలకొంది.

Updated Date - 2022-08-05T04:03:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising