ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Krishnam Raju: కృష్ణం రాజు మృతికి అసలు కారణం అదేనట.. వెల్లడించిన కుటుంబ సభ్యులు

ABN, First Publish Date - 2022-09-11T16:50:51+05:30

రెబల్ స్టార్ కృష్ణం రాజు (rebel star krishnam raju) అకాల మరణంతో టాలీవుడ్‌లో (Tollywood) విషాద ఛాయలు అలుముకున్నాయి. 83 సంవత్సరాల వయసులో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రెబల్ స్టార్ కృష్ణం రాజు (rebel star krishnam raju) అకాల మరణంతో టాలీవుడ్‌లో (Tollywood) విషాద ఛాయలు అలుముకున్నాయి. 83 సంవత్సరాల వయసులో (krishnam raju age) కాలం చేసిన కృష్ణం రాజు (krishnam raju died) కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే.. ఆయన మృతికి (krishnam raju passed away) కారణం ఏంటో కుటుంబ సభ్యులు వెల్లడించారు. పోస్ట్‌ కోవిడ్ సమస్యతో కృష్ణం రాజు (rebel star krishnam raju latest news) తొలుత ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికే రెండుసార్లు పోస్ట్ కోవిడ్ సమస్యతో బాధపడ్డ కృష్ణంరాజు (rebel star krishnam raju rip) గుండెపోటు రావడంతో గచ్చిబౌలి ఏఐజీలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణం రాజుకు (rebel star krishnam raju family) భార్య శ్యామలా దేవి (krishnam raju wife), ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.



తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో కృష్ణంరాజుకంటూ (rebel star krishnam raju death) కొన్ని పేజీలున్నాయనడంలో సందేహమే లేదు. దాదాపు 187 సినిమాల్లో నటించి మెప్పించిన కృష్ణం రాజు (krishnam raju movies) ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం పొందారు. టాలీవుడ్ హీరో ప్రభాస్‌కు కృష్ణం రాజు పెదనాన్న అవుతారన్న సంగతి అందరికీ తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని నివాసానికి కృష్ణంరాజు (RIP Sir) భౌతికకాయాన్ని తరలించనున్నారు. కృష్ణంరాజు (Prabhas Krishnam Raju) ఇంటికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. అభిమానులకు చివరి చూపు కోసం మధ్యాహ్నం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియానికి కృష్ణంరాజు భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు తరలించనున్నారు. సోమవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ సినిమాలో పరమహంస పాత్రలో కృష్ణం రాజు చివరిగా నటించారు.



1966లో 'చిలకా గోరింక' చిత్రంతో కృష్ణం రాజు తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు. తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి బ్రహ్మన్న, కటకటాల రుద్రయ్య, వినాయక విజయం, రంగూన్‌ రౌడీ, ధర్మాత్ముడు, బావ బావమరిది, బ్రహ్మనాయుడు, త్రిశూలం, భక్త కన్నప్ప, మనఊరి పాండవులు, అమరదీపం, సీతారాములు వటి పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రభాస్‌తో కలిసి బిల్లా, రెబల్, రాధేశ్యామ్‌ చిత్రాల్లో ఆయన నటించారు. 1977, 1984లో కృష్ణంరాజు నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో 'తాండ్రపాపారాయుడు' చిత్రానికి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు సొంతమైంది. కృష్ణం రాజు (krishnam raju bjp) రాజకీయాల్లో కూడా రాణించారు. బీజేపీ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన కృష్ణంరాజు.. వాజ్‌పేయి కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా సేవలందించారు. కాకినాడ, నరసాపురం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ (krishnam raju prp) పట్ల ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు. కొన్నాళ్లకు ప్రజారాజ్యం పార్టీకి కృష్ణం రాజు రాజీనామా చేశారు. ఆ తర్వాత మళ్లీ బీజేపీలో చేరారు.

Updated Date - 2022-09-11T16:50:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising