ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్ప

ABN, First Publish Date - 2022-01-27T05:50:38+05:30

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీఆర్‌ఎస్‌ నాయకత్వం కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్యక్ష పదవిని సిర్పూర్‌ శాసనసభ్యుడు కోనేరు కోనప్పకు కట్టబెట్టింది.

ఎమ్మెల్యే కోనేరు కోనప్పను సన్మానిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, జనవరి 26(ఆంధ్రజ్యోతి): అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీఆర్‌ఎస్‌ నాయకత్వం కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్యక్ష పదవిని సిర్పూర్‌ శాసనసభ్యుడు కోనేరు కోనప్పకు కట్టబెట్టింది. మూడు నెలల డైలామాకు తెరదించుతూ బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా ఆధ్యక్షుల  జాబితాను ప్రకటించారు. రెండు నెలల క్రితం ప్రారంభమైన పార్టీ సంస్థగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే గ్రామ, మండల కార్యవర్గాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. కీలకమైన జిల్లా అధ్యక్ష పదవికి సంబందించి చాలా మంది పోటిపడటంతో అదిష్ఠానం జిల్లాలో పదవిని అశిస్తున్న ముఖ్యుల జాబితాను ఇవ్వాలని కోరింది. ఈ క్రమంలో ఆసిఫాబాద్‌ నుంచి జడ్పీటీసీ సభ్యుడు అరిగెల నాగేశ్వర్‌రావు, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి శ్యాంరావుల పేర్లను పంపినట్లు తెలిసింది. వీరితో పాటు మరో ఇద్దరు ముగ్గురు నేతలు కూడా జిల్లా అధ్యక్ష పదవి కోసం పైరవీలు సాగించారు. దాంతో రాష్ట్ర నాయకత్వం జిల్లాలోని స్థితిగతులు, క్యాడర్‌ అభిప్రాయం, ప్రజల్లో పలుకుబడి వంటి వివిధ అంశాలపై ఇంటలిజెన్స్‌ ద్వారా సమాచారాన్ని సేకరించింది. ఈ  నేపథ్యంలో అన్ని అంశాలను బేరిజు వేసిన తర్వాత పార్టీ అధినేత అనూహ్యంగా జిల్లా అధ్యక్ష పదవికి కోనేరు కోనప్పను ప్రకటించడం పార్టీ వర్గాలనే కాదు ఎకంగా కోనప్పను కూడ అశ్చర్యానికి గురి చేసింది.  ఈ సందర్భంగా కోనప్పను కాగజ్‌నగర్‌లో నాయకులు సన్మానించారు.


Updated Date - 2022-01-27T05:50:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising