రైతులకు న్యాయం జరిగేలా చూడాలి
ABN, First Publish Date - 2022-12-31T23:18:44+05:30
జిల్లాలో పత్తి రైతులు తమ పంటను విక్రయించుకునే క్రమంలో వారు మార్కెట్‌లో మోసపోకుండా చూడాలని అదనపు కలెక్టర్ నటరాజన్ అన్నారు.
ఆదిలాబాద్ టౌన్, డిసెంబరు 31 : జిల్లాలో పత్తి రైతులు తమ పంటను విక్రయించుకునే క్రమంలో వారు మార్కెట్‌లో మోసపోకుండా చూడాలని అదనపు కలెక్టర్ నటరాజన్ అన్నారు. శనివారం జిల్లా మార్కెట్ యార్డును సందర్శించిన ఆయన రైతులు మార్కెట్‌కు తెస్తున్న పత్తిలో నాణ్యత ఉందన్నారు. కొన్ని రోజులుగా మద్దతు ధర లేక పత్తిని రైతులు విక్రయించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. 8 శాతం తేమతో రైతులు నాణ్యమైన పత్తికి రూ.8050 ఉందని, మార్కెట్‌లోనే రైతులు పత్తిని విక్రయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ ఏడీ శ్రీనివాస్, నాయకులు రాజు, సిబ్బంది, శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.
Updated Date - 2022-12-31T23:18:45+05:30 IST