ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘భూనిర్వాసితులకు న్యాయం చేయాలి’

ABN, First Publish Date - 2022-01-18T04:24:46+05:30

ఎన్‌హెచ్‌ 360 విస్తరణలో భాగంగా భూము లు కోల్పోయిన ఆదివాసీలకు న్యాయం చేయాలని సోషలిస్టు పార్టీ (ఇండియా) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గుణ పేర్కొన్నారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూములు కోల్పోయిన వారిలో అధిక శాతం ఆదివాసీ గిరిజనులే ఉన్నారని తెలిపారు.

మాట్లాడుతున్న సోషలిస్టు పార్టీ (ఇండియా) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గుణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మందమర్రిటౌన్‌, జనవరి 17: ఎన్‌హెచ్‌ 360 విస్తరణలో భాగంగా భూము లు కోల్పోయిన ఆదివాసీలకు న్యాయం చేయాలని సోషలిస్టు పార్టీ (ఇండియా) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గుణ పేర్కొన్నారు. సోమవారం  ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూములు కోల్పోయిన వారిలో అధిక శాతం ఆదివాసీ గిరిజనులే ఉన్నారని తెలిపారు. వీరి స్థానంలో రెవెన్యూ సిబ్బం ది, కొందరు అధికార పార్టీ నాయకులు కలిసి సర్వే నెంబరు 99, 130, 131, 141లో రికార్డులు మార్పులు చేశారని ఆరోపించారు. 99 సర్వే నెంబరులో  అనర్హులకు అవార్డు ప్రొసీడింగ్‌ ఇచ్చారన్నారు. 130,131 సర్వే నెంబర్లలో  నాలుగు కుటుంబాలు ఉండగా ఒక కుటుంబానికి చెందిన వారినే అనర్హులుగా ప్రకటించారన్నారు. 141 సర్వే నెంబరులో అన్నదమ్ములకు అవార్డు ప్రొసీడింగ్‌ ఇచ్చి ఇప్పుడు ఒకరికి భూమి లేదని నోటీసులు ఇవ్వడం సరైంది కాదన్నారు. నాయకులు జైనేని కార్తీక్‌, భూనేని సంతోష్‌, నిర్వాసితులు ఎల్లక్క, జమున, పోసక్క, సుజాత, మల్లేష్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-18T04:24:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising