ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం

ABN, First Publish Date - 2022-08-14T04:12:52+05:30

కాంగ్రెస్‌ పార్టీతోనే పేదలకు న్యాయం జరుగుతుందని డీసీసీ అధ్య క్షురాలు కొక్కిరాల సురేఖ, ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శనివారం జీఎం కార్యాలయం నుంచి మధ్యాహ్నం ప్రారంభ మై సీసీసీ మీదుగా తోళ్లవాగు వరకు చేరుకోగా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు.

పాదయాత్రలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీరాంపూర్‌, ఆగస్టు 13: కాంగ్రెస్‌ పార్టీతోనే పేదలకు న్యాయం జరుగుతుందని డీసీసీ అధ్య క్షురాలు కొక్కిరాల సురేఖ, ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శనివారం  జీఎం కార్యాలయం నుంచి మధ్యాహ్నం ప్రారంభ మై సీసీసీ మీదుగా తోళ్లవాగు వరకు చేరుకోగా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. అనం తరం సూర్యనగర్‌ వద్ద మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఆదరించాలని కోరారు.

కౌన్సిలర్‌, ఫ్లోర్‌ లీడర్‌ సుర్మిళ్ల వేణు అతని మిత్ర బృందం 75 మీటర్ల జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయగా ప్రేంసాగర్‌రావు, సురేఖలు ఆవిష్కరించారు. 

కోటపల్లి: ప్రజల వెన్నంటే కాంగ్రెస్‌ పార్టీ ఉం టుందని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు.  సర్వాయిపేట నుంచి కోటపల్లి వరకు ఆజాదీకా గౌరవ్‌ యాత్ర నిర్వహించారు. తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని, సోనియమ్మకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారన్నారు. ఈ ప్రాంతంలో సుమన్‌ రూపంలో మరో రజాకర్‌ వచ్చారని, ఆయ న ఆటలు ఇక చెల్లవన్నారు.  అధికార బలంతో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్రమంగా కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిం చారు.  మాజీ జడ్పీటీసీ పోటు రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ తాళ్ల బాపు, దుర్గం వెంకటస్వామి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఏసీసీ:  కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన పాదయాత్ర మంచిర్యాల పట్టణానికి చేరుకుంది. జాతీయ పతాకంతో చేపట్టిన ర్యాలీలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖలు మాట్లాడుతూ అనేక ఉద్యమాల ద్వారా కాంగ్రెస్‌ పార్టీ దేశానికి స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర  పోషించిందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  

 

Updated Date - 2022-08-14T04:12:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising