ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం

ABN, First Publish Date - 2022-07-04T03:58:59+05:30

కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం జరుగుతుం దని ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు అన్నారు. నస్పూర్‌ పట్టణం సీసీసీలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

పార్టీలోకి చేరిన వారికి కండువా వేస్తున్న ప్రేంసాగర్‌రావు, సురేఖ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 - మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు  

నస్పూర్‌, జూలై  3: కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం జరుగుతుం దని ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు అన్నారు. నస్పూర్‌ పట్టణం సీసీసీలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు మున్సిపా లిటీలో  12 వార్డుల నుంచి టీఆర్‌ఎస్‌, బీజేపీ  నాయకులు, కార్యకర్త లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు రొడ్డ రాజేషం, శ్రీనివాస్‌గౌడ్‌, బీజేపీ నస్పూర్‌ మహిళా అధ్యక్షురాలు శ్వేతా, బీజేపీ మహిళా మోర్చా జిల్లా కోశాధికారి సంద్యారాణి, బీజేపీ నస్పూర్‌ పట్టణ కార్యదర్శి లక్ష్మికాంత్‌, టీఆర్‌ఎస్‌ యువజన కార్యదర్శి సందీప్‌, 22వ వార్డు నుంచి సంపత్‌, టీబీజీకేఎస్‌ నాయకులు లక్ష్మి నరసయ్య, గట్టు సత్తయ్య, నరసిం హరాజు, ఎల్లయ్య, హరనాథ్‌రావు, వారి అనుచరులు దాదాపు  800 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. పార్టీలో చేరిన వారందరికీ ప్రేంసాగర్‌రావు, సురేఖ కండువా వేసి ఆహ్వానించారు. సమావేశంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్‌,  కౌన్సిలర్లు సుర్మిళ్ల వేణు, సీపతి సుమతి-మల్లేష్‌, గెల్లు రజిత  మల్లేష్‌, బొద్దున సంధ్యారాణి రాంమూర్తి, తెనుగు లావణ్య  దేవేందర్‌,  కాం గ్రెస్‌ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కలిద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-04T03:58:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising