ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూల పండుగకు వేళాయే..

ABN, First Publish Date - 2022-10-03T04:04:57+05:30

తెలంగాణ ప్రాంతానికి చెందిన పండుగల్లో బతుకమ్మకు ఎంతో విశిష్టత ఉంది. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ మొదలుకొని చివరి రోజు సద్దుల బతుకమ్మ వరకు ఏరోజుకు ఆరోజే ప్రత్యేకం. వీటిలో సద్దుల బతుకమ్మ మరెంతో వేడుకగా ఉంటుంది.

మంచిర్యాల మార్కెట్‌లో పూల అమ్మకాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు

తాండూర్‌, అక్టోబరు 2: తెలంగాణ ప్రాంతానికి చెందిన పండుగల్లో బతుకమ్మకు ఎంతో విశిష్టత ఉంది. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ మొదలుకొని చివరి రోజు సద్దుల బతుకమ్మ వరకు ఏరోజుకు ఆరోజే ప్రత్యేకం. వీటిలో సద్దుల బతుకమ్మ మరెంతో వేడుకగా ఉంటుంది. సద్దుల బతుకమ్మ రోజు మహిళలు, యువతులు, బాలికలు నూతన దుస్తులు ధరించి సంప్రదాయంగా కనిపిస్తారు. తీరుతీరు పూలను సేకరించి పోటాపోటీగా బతుకమ్మలు పేర్చుకుని సాయంత్రం ఆటకు వైభవంగా వెళ్తారు.  ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు సోమవారం సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. 

కళకళలాడుతున్న గ్రామాలు

బతుకమ్మ, దసరా పండుగల కోసం ఎక్కడెక్కడో ఉన్న వారంతా వారివారి స్వగ్రామాలకు చేరుకున్నారు. పిల్లలకు సెలవులు రావడంతో మహిళలు, పిల్లలు గ్రామాలకు చేరుకున్నారు. చివరి రోజున బంధుమిత్రులతో సద్దుల బతుకమ్మ వేడుకలు ఈసారి అంబరాన్ని అంటనున్నాయి. 

 సహజత్వం.. శాస్త్రీయత.. సంప్రదాయం

పూల పండుగ బతుకమ్మ ఆద్యంతం సహజత్వం, శాస్త్రీయతలను మేళవించుకుని ఉంటుంది. వర్షాలు తగ్గుముఖం పట్టి మంచు కురిసే రోజుల్లో ఈ పండుగ వస్తుంది. బతుకమ్మలో ఉపయోగించే ప్రతీ పువ్వులోనూ ఔషధ గుణాలుంటాయి. వీటిని జలాశయాల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటికి, ప్రకృతికి ఎలాంటి నష్టం ఉండదు. పైగా నీటికి ఔషధ గుణాలు కూడా కలిసిపోతాయి.  సద్దుల బతుకమ్మ రోజున కూడా ప్రత్యేకంగా ఇళ్లలోనే ప్రసాదాలు తయారు చేస్తారు. పలు రకాల సత్తు పిండి, పిండి వంటలు తయారుచేస్తారు. బతుకమ్మ నిమజ్జనం అనంతరం మహిళలు ఒకరికొకరు వైనాలు ఇచ్చిపుచ్చుకుంటారు. 

  పూల దుకాణాలు కళకళ...

సద్దుల బతుకమ్మ రోజునే పోటా పోటీగా బతుకమ్మలు పేరుస్తారు. ఇందుకోసం ఎవరి స్ధాయిలో వారు రక రకాల పూలను సేకరిస్తారు. గునుగు, తంగేడు లాంటి  పూలతో పాటు బతుకమ్మలను తయారు చేసేందుకు బంతి, చామంతి, గులాబీ, సీతమ్మ జెడలు, పట్టుకుచ్చులు లాంటి పూలను కొనుగోలు చేసి భారీ బతుకమ్మలు తయారు చేస్తారు. దీంతో జిల్లాలోని పలు పట్టణాల్లోని పూల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. బంతి పూలు కిలోకు రూ.100 నుంచి 150 వరకు, చామంతి, గులాబీ  రూ.300 నుంచి 400ల వరకు ధర పలుకుతున్నాయి. గునుగు, పట్టుకుచ్చులు రూ.100కు నాలుగు చొప్పున ఇస్తున్నారు. ఇప్పటికే మార్కెట్‌లలో పూల వ్యాపారులు పెద్ద ఎత్తును పూలను దిగుమతి చేసుకున్నారు. పండుగ సందర్భంగా  సీతారాంపల్లి, లక్షెట్టిపేట, బెల్లంపల్లి, తాండూర్‌ ప్రాంతాల్లో ప్రత్యేకంగా బంతి, సీతమ్మ జెడల పూల తోటలను సాగుచేశారు. 

 సద్దుల బతుకమ్మకు ప్రత్యేక ఏర్పాట్లు 

సద్దుల బతుకమ్మ రోజున గ్రామాలు, పట్టణాల్లో ఎవరి వాడల్లో వారు అర్ధరాత్రి వరకు ఆటాపాటలతో బతుకమ్మ ఆడుతారు. అనంతరం బతుకమ్మలను జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు. ఆయా మున్సిపాలి టీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. లైటింగ్‌, వాగులు, చెరువుల వద్ద ముళ్ళపొదల తొలగింపు చేపట్టారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు, అధికారులు ఏర్పాట్లుచేశారు. 

Updated Date - 2022-10-03T04:04:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising