ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైస్‌ మిల్లు యజమానులపై బురద చల్లడం సరికాదు

ABN, First Publish Date - 2022-10-05T03:32:23+05:30

రైస్‌ మిల్లు యజమానులపై బురద చల్లడం సరికాదని రైస్‌ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు చిలువేరు సత్యనారాయణ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న రైస్‌ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు చిలువేరు సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-రైస్‌ మిల్లర్ల సంఘం అఽధ్యక్షుడు చిలువేరు సత్యనారాయణ

కాగజ్‌నగర్‌, అక్టోబరు 4: రైస్‌ మిల్లు యజమానులపై బురద చల్లడం సరికాదని రైస్‌ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు చిలువేరు సత్యనారాయణ అన్నారు.  స్థానికంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పీడీఎస్‌ బియ్యం నిల్వల్లో తేడా విషయంలో రైస్‌ మిల్లర్లపై బురద జల్లే ప్రయత్నం కొంత మంది నాయకులు చేస్తున్నారని చెప్పారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయ కోణంలో ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలన్నారు. ఎమ్మెల్యే చేసే అన్నదానంకు బియ్యం దానం చేస్తే దోచుకున్న సొమ్ము ఇచ్చారని, రైస్‌ మిల్లర్లను దొంగలుగా అనే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. ఇదే విషయంపై మరోసారి మాట్లాడితే రైస్‌ మిల్లులను మూసివేస్తామని హెచ్చరించారు. అన్నదానం, అంబలి పంపిణీ, సాముహిక వివాహలకు ఆర్య వైశ్యులు పూర్తిగా అండగా ఉంటారని చెప్పారు.  840 టన్నుల బియ్యం కుంభకోణం జరిగిందని, దానిని ఎమ్మెల్యే పేరు, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పేరిట ఆరోపణలు బీజేపీ నాయకుడు డాక్టర్‌ హరీష్‌బాబు చేయడం సరికాదని తెలిపారు. ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించాలని సూచించారు. సమావేశంలో రైస్‌మిల్లర్ల సంఘం సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-05T03:32:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising