ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోంగార్డులు పెన్షన్‌ పథకాలలో చేరడం ఉత్తమం

ABN, First Publish Date - 2022-12-06T23:56:29+05:30

హోంగార్డులు పెన్షన్‌ పథకాలలో చేరడం ఉత్తమం అని ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6 : హోంగార్డులు పెన్షన్‌ పథకాలలో చేరడం ఉత్తమం అని ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లోని హోంగార్డు కార్యాలయంలో ఉదయం హోంగార్డు రైసింగ్‌ డే ఉత్సవ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. ముందుగా హోంగార్డు యూనిట్‌ ద్వారా ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని స్వీకరించి హోంగార్డుల జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డు డే సందర్భంగా హోంగార్డులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ హోంగార్డులకు పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం ద్వారా పెన్షన్‌ ఉండదన్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడే ప్రభుత్వ, ప్రైవేట్‌ పెన్షన్‌ పథకాలలో చేరడం ఉత్తమమని హోంగార్డులకు సూచించారు. పోలీసులతో సమానంగా నిస్వార్ధమైన విధులు నిర్వర్తిస్తున్నారని, హోంగార్డుల సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారాలకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎస్‌.శ్రీనివాసరావు, సమైజాన్‌రావు, పట్టణ సీఐలు పురుషోత్తం, మల్లేష్‌, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు వెంకటి, వేణు, గుణవంతరావు, వంశీకృష్ణ, పోలీసు అసోసియేషన్‌ సభ్యులు, ఎస్సైలు, హోంగార్డులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:56:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising