ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-11-28T22:36:47+05:30

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిం చారు

దరఖాస్తులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ మఽధుసూదన్‌నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 28: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిం చారు. కాసిపేట మండలం దుబ్బగూడెం గ్రామానికి చెందిన దరావత్‌ తిరుపతి, లావణ్య, రమేష్‌, మహారాజులు తమ తండ్రి పేరిట దుబ్బగూడెం గ్రామంలో భూమి, తమ తల్లి పేరిట ఇల్లు ఉండగా ఓపెన్‌కాస్టులో పోతున్నాయని, డబ్బులు ఇప్పిస్తానని చెప్పి ఒక వ్యక్తి తన బంధువుల పేరిట మార్పిడి చేసుకున్నాడని, ఈ విషయమై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. దివ్యాంగుల చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మేడపట్ల సతీష్‌ అర్హులైన దివ్యాంగులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల అందజేయాలని విజ్ఞప్తి చేశారు. బెల్లంపల్లి మండలం చొప్పరిపల్లి గ్రామానికి చెందిన పచ్చునూరు సంధ్యారాణి, తరహర్ల ప్రవళిక తాము సాగు చేసుకుంటున్న భూమిని కొందరు ఆన్‌లైన్‌లో తమ పేరిట చేసుకున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని దరాఖాస్తు అందజేశారు. దండేపల్లి మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన వేల్పుల రాజేష్‌ తనకు ఎస్సీ కార్పొరేషన్‌ యూనిట్‌ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారని తెలిపారు.

Updated Date - 2022-11-28T22:36:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising