ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మచ్చలేని నాయకుడు ఇంద్రకరణ్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-12-07T01:54:18+05:30

అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన బీజేపీ చోటా, మోటా నాయకులు రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిపై అనవసరమైన ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు హెచ్చరించారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ నిర్మల్‌ పట్టణ అధ్యక్షుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ అర్బన్‌, డిసెంబరు 6 : అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన బీజేపీ చోటా, మోటా నాయకులు రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిపై అనవసరమైన ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ఎఫ్‌ఏసీఎస్‌ చైర్మన్‌ ధర్మా జీ రాజేందర్‌, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణలు మాట్లాడుతూ... బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ప్రజాసంగ్రామయాత్ర సందర్భంగా రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిపై నిరాధారణమైన ఆరోపణలు చేయడం వారి అవివేకమన్నారు. గతంలో కలెక్టరే ట్‌ నిర్మాణానికి భీమన్న గుట్ట ప్రాంతాన్ని ఎంపిక చేయగా బీజేపీ నాయకులే అక్కడ ఆలయాలు ఉన్నాయని వాటి ఉనికి కోల్పోతుందని ధర్నా, నిరసనలు చేపట్టడంతోనే వేరే ప్రాంతంలో కలెక్టరేట్‌ నిర్మాణం చేయడం జరిగిందన్నారు. అలాగే ఇక్కడ గతంలో మున్సిపాలిటీపరంగా పాలన కొనసాగించిన నాయకు లు భూ కబ్జాలకు పాల్పడ్డారని, దాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై నెట్టడం సరికాదన్నారు. ఆ నాయకులే ప్రస్తుతం ఆ పార్టీలో కొనసాగుతున్నారన్నారు. మంచిర్యాల చౌరస్తా శివాజీచౌక్‌ నందు నెలకొల్పిన శివాజీ మహారాజ్‌ విగ్ర హాన్ని మంత్రి ఐకేఆర్‌ ప్రత్యేక చొరవతో అక్కడ నెలకొల్పడం జరిగిందని, గతంలో ఏర్పాటు కోసం బీజేపీలోని ఓ నేత డబ్బులు వసూలు చేసుకొని జేబులు నింపుకున్నాడని ఆరోపించారు. 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మంత్రి ఐకే రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే బీజేపీ నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిలుక రమణ, ఎంపీపీ రామేశ్వర్‌ రెడి, చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, ముడుసు సత్యనారాయణ, హజ్‌ కమిటీ సభ్యులు నజీరొద్దీన్‌, పాకాల రాంచందర్‌, ఆయా వార్డుల కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T01:54:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising