ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలు

ABN, First Publish Date - 2022-08-10T06:10:33+05:30

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర వజ్రోత్సవ కార్యక్రమా లను చేపట్టింది. ఈ వజ్రోత్సవ వేడుకలను జిల్లాలో మంగళవారం ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లా డుతూ

జాతీయ జెండాలతో కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌ అర్బన్‌, ఆగస్టు 9: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర వజ్రోత్సవ కార్యక్రమా లను చేపట్టింది. ఈ వజ్రోత్సవ వేడుకలను జిల్లాలో మంగళవారం ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లా డుతూ ప్రజలంతా భాగస్వాములై వజ్రోత్సవ కార్యక్రమాలను విజయవం తం చేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగం గా పిల్లల కోసం పట్టణంలోని మూడు థియేటర్‌లలో ప్రతీరోజు గాంధీ సిని మాను ఉచితంగా ప్రదర్శించనున్నారు. ఈ మేరకు స్థానిక మహేశ్వరి థియే టర్‌లో గాందీ సినిమా ప్రదర్శనను ప్రారంభించగా ఎమ్మెల్యే జోగు రామన్న, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డిలు కార్యక్రమ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకుముందు వారికి విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. జాతీయ జెండాలను చేతపట్టుకుని విద్యార్థులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో సందడి వాతావరణం కనిపించింది. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న రిబ్బన్‌ కట్‌ చేసి ప్రదర్శనను ప్రారంభించారు. చిన్నారులతో కలిసి కార్యక్రమ అతిథులు చిత్రాన్ని తిలకించారు. దేశం కోసం అసువులు బాసిన వీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆ తర్వాత కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ వాదం పెంపొందించే దిశగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. దేశ స్వా తంత్య్రం కోసం అనేక త్యాగాలు చేసి అసువులు బాసిన మహానీయుల త్యాగాలను విద్యార్థులకు తెలియజెప్పేలా గాంధీ సినిమాను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ ఉదయ్‌కుమార్రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన పల్లెలు, పట్టణాల్లో ప్రజలంతా ఒకే చోట చేరి జాతీయ గీతాన్ని ఆలపించాల ని, అదేవిధంగా ప్రీడంరన్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు.

అలాగే, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ  ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ఆదర్శ పాఠశాల, బంగారుగూడ పాఠశాలతో పాటు ఆయా పాఠశాలల విద్యార్థులను గాంధీ సినిమా ప్రదర్శనకు ఉపాధ్యాయులు తీసుకెళ్లారు.  కాగా, భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో వచ్చే అన్ని ప్రీ ఇండిపెండెన్స్‌ ఆఫ్‌ ఇండియాకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు విద్యార్థులు జవాబులు చేయగలుగుతారని ప్రిన్సిపాల్‌ కె.సంధ్యారాణి తెలి పారు. ఇందులో 110 విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. 

Updated Date - 2022-08-10T06:10:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising