ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధాప్యంలో అందరితో కలిసిమెలిసి జీవించాలి

ABN, First Publish Date - 2022-10-02T03:44:21+05:30

వృద్ధాప్యంలో అందరితో కలిసి మెలిసి సంతోషంగా జీవించాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. శనివారం షాదీఖానాలో ఏర్పాటు చేసిన ప్రపంచ వయోవృద్ధుల వేడుకల్లో పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వృద్ధులు తమ అను భవంతో భావితరాలకు మార్గదర్శకత్వం చేయాలన్నారు. పిల్లలను మానవ సంబంధాలు తెలిసేలా పెంచాలన్నారు.

భోజనాలు వడ్డిస్తున్న కలెక్టర్‌ భారతి హోళ్లికేరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 1: వృద్ధాప్యంలో అందరితో కలిసి మెలిసి సంతోషంగా జీవించాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. శనివారం షాదీఖానాలో ఏర్పాటు చేసిన ప్రపంచ వయోవృద్ధుల  వేడుకల్లో పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వృద్ధులు తమ అను భవంతో భావితరాలకు మార్గదర్శకత్వం చేయాలన్నారు. పిల్లలను మానవ సంబంధాలు తెలిసేలా పెంచాలన్నారు. వృద్దుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని,  సమస్యల పరి ష్కారం, అవసరాలకు టోల్‌ఫ్రీ నం.14567 ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం అందించే పథకాలు  సద్వినియోగం చేసుకోవాలన్నారు.  వయోవృద్ధులు ఆలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పలువురు వయో వృద్ధులను సన్మానించారు.  జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య, పంచాయతీ అధికారి నారాయణరావు, గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, డేకేర్‌ సెంటర్‌ అధ్యక్షుడు మొండయ్య, సీడీపీవోలు, జిల్లా బాలల సంక్షేమ అధికారి ఆనంద్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-10-02T03:44:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising