ఇంటర్మీడియట్‌లో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలపాలి
ABN, First Publish Date - 2022-12-15T22:48:23+05:30
ఆసిఫాబాద్, డిసెంబరు 15: ఇంటర్మీడి యట్ విద్యలో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచే విధంగా అధ్యాపకులు కృషిచే యాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురు వారం జిల్లాకేంద్రంలోని జన్కాపూర్ రైతువేది కలో అదనపుకలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీధర్ సుమన్ తో కలిసి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూని యర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
- కలెక్టర్ రాహుల్ రాజ్
ఆసిఫాబాద్, డిసెంబరు 15: ఇంటర్మీడి యట్ విద్యలో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచే విధంగా అధ్యాపకులు కృషిచే యాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురు వారం జిల్లాకేంద్రంలోని జన్కాపూర్ రైతువేది కలో అదనపుకలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీధర్ సుమన్ తో కలిసి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూని యర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యలో జిల్లారెండవ స్థానం లో నిలిచిందని, ఇదేస్పూర్తితో మరింత కృషి చేసి ప్రథమస్థానం సాధించే విధంగా అధ్యాపకులు దృష్టి సారించాలన్నారు. వార్షిక పరీక్షలకు విద్యార్థు లను సన్నద్దం చేయాలని, ప్రణాళిక ప్రకారం సెలబస్ పూర్తి చేయడంతోపాటు రివిజన్ చేయించి ఉత్తమ మైన ఫలితాలు సాధించే దిశగా అధ్యాపకులు దృష్టి సారించాలని తెలిపారు. విద్యార్థులను గ్రూపులుగా విభజించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.
Updated Date - 2022-12-15T22:48:24+05:30 IST