ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకట్టుకున్న ప్రదర్శనలు

ABN, First Publish Date - 2022-09-24T04:10:12+05:30

జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్‌ డ్రామ ఫెస్టివల్‌లో జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ప్రశంసాపత్రాలతో విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 23: జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం  నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్‌ డ్రామ ఫెస్టివల్‌లో జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మానవ జాతి కోసం శాస్త్ర సాంకేతిక అంశంపై జిల్లాలోని ఎనిమిది పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు. బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మణెమ్మ మాట్లాడారు. విద్యా ర్థులు శాస్త్ర సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. జిల్లా సైన్స్‌ అధికారి మధుకర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి సైన్స్‌ డ్రామా ఉద్దేశాన్ని వివరించారు. న్యాయ నిర్ణేతలుగా కళాకారులు గుర్రాల వెంకటేశ్వర్లు, వెంకట్రావు పాల్గొన్నారు. సమన్వయకర్తగా ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు వ్యవహరించారు. జన్కాపూర్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రబోథ్‌కుమార్‌, డీఈవో కార్యాలయ ప్రతినిధి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా కౌటాల ఇన్‌ఫ్రంట్‌ జీజెస్‌ ప్రథమ స్థానంలో నిలువగా, జన్కాపూర్‌ జడ్పీఎస్‌ఎస్‌ పాఠశాల ద్వితీయ స్థానం, కాగజ్‌నగర్‌ టీఎస్‌డబ్ల్యూఆర్‌ పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అధికారులు ప్రశంసాపత్రాలు అందజేశారు.

Updated Date - 2022-09-24T04:10:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising