ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ విధానాలతో అభివృద్ధికి ఆటంకం

ABN, First Publish Date - 2022-07-07T04:38:24+05:30

టీఆర్‌ఎస్‌ విధానాలతో రాష్ట్రంలో అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా సర్వసభ్యసమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

మంచిర్యా కలెక్టరేట్‌, జూలై 6: టీఆర్‌ఎస్‌ విధానాలతో రాష్ట్రంలో అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా సర్వసభ్యసమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఎమ్మెల్సీ మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ విధానాలను ప్రజలు అసహ్యించు కుంటున్నారన్నారు. వ్యక్తిగత కారణాలు, రాజకీయాలు మానుకుని జిల్లా అభివృద్ధికి పాటుపడాలన్నారు.  ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన ప్రజా ప్రతినిధులు సమావేశానికి దూరంగా ఉండటం ఏంటని మండిపడ్డారు. జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి మహిళ కావడంతోనే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే వేదికైన సమావేశానికి హాజరుకాకపోవడాన్ని రాజకీయ వికృత క్రీడ అని తెలిపారు.  కార్యక్రమంలో లక్సెట్‌పేట, దండెపల్లి, భీమిని జడ్పీటీసీలు ముత్తెసత్తయ్య, నాగమణి, గంగమ్మ, ఎంపీపీ మంగచిన్నన్న తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T04:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising