దళితులపై అక్రమ కేసులు అప్రజాస్వామికం
ABN, First Publish Date - 2022-10-07T06:14:52+05:30
దళితబంధు పథకంలో తమకు అన్యా యం జరిగిందంటూ మాట్లాడిన దళితులపై అక్రమ కేసులు బనాయిం చడం అప్రజాస్వామిక చర్యల్లో భాగమేనని ఏఐసీసీ కార్యక్రమాల అమ లు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆ యన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లా డారు.
నిర్మల్ చైన్‌గేట్, అక్టోబరు 6: దళితబంధు పథకంలో తమకు అన్యా యం జరిగిందంటూ మాట్లాడిన దళితులపై అక్రమ కేసులు బనాయిం చడం అప్రజాస్వామిక చర్యల్లో భాగమేనని ఏఐసీసీ కార్యక్రమాల అమ లు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆ యన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లా డారు. దళితబంధు పథకం కింద తమను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించిన దళితులను సాక్షాత్తు మంత్రి దూషించడం అన్యాయమన్నా రు. పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రశ్నించిన దళితు లపై అక్రమ కేసులు బనాయించడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నిం చారు. ప్రశ్నిచే గొంతులను అణిచి వేయడమే ప్రభుత్వ ధ్యేయంగా మా రిందన్నారు. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యయుత కార్యకలాపాలు జరగ డం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో దళితులకు మద్దతుగా తాము శాంతియుత ఆందోళన చేపట్టేందుకు అనుమతి కోరినా పట్టించుకోవడం లేదని తెలిపారు. శాంతియుత ఆందోళనకు కూడా అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ నేతలు, స్థానిక మంత్రికి దళితుల పట్ల ద్వేషభావం ఉందన్నారు. దళితులను కించపరిచే విధంగా మాట్లాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. బీఆర్‌ఎస్ పార్టీ అంటే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అని ఎద్దేవా చే శారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఇక కాలం చెల్లిందన్నారు. దళితుల పక్షాన కాం గ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామన్నారు. దళితు లందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో దిలావర్‌పూర్ మండల అధ్యక్షుడు డి.ముత్యంరెడ్డి, నిర్మల్ పట్టణాధ్యక్షుడు నాందేడపు చిన్ను, కాంగ్రెస్ సీనియర్ నేత అయ్యన్న గారి పోశెట్టి, కాంగ్రెస్ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు జునైద్, జమాల్, మార గంగారెడ్డి, ధర్మతేజ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-07T06:14:52+05:30 IST