ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిధులు లేని పాలన ఎలా చేయాలి?

ABN, First Publish Date - 2022-05-22T06:56:20+05:30

గ్రామపంచాయతీ ఖాతాల్లో రూపాయి లేకుండా పాలన ఎలాసాధ్యమని సర్పంచ్‌లు నిలదీశారు.

అంబేద్కర్‌ భవనం ముందు బైఠాయించిన సర్పంచ్‌లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ అర్బన్‌, మే 21 : గ్రామపంచాయతీ ఖాతాల్లో రూపాయి లేకుండా పాలన ఎలాసాధ్యమని సర్పంచ్‌లు నిలదీశారు. త్వరలోనే జరగనున్న పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసిన అవగాహన సద స్సు బహిష్కరించి సర్పంచ్‌లు తమ నిరసన తెలిపారు.. ఇది జిల్లాకేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌భవన్‌లో మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శు లు, మండల పంచాయతీ అధికారులు, ఎంపీడీవోల సమీక్షా సమావేశం నిర్వ హించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈ సదస్సుకు రావడానికి ముందు పంచా యతీ సర్పంచ్‌లు తాము ఈ సదస్సును బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆపై అంబేద్కన్‌భవన్‌ ముందు భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ముధోల్‌ మండల కేంద్రం మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ రాజేందర్‌లు సర్పంచ్‌ల మూకుమ్మడి ఆందోళనకు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పల్లెప్రగతి కార్య క్రమం నిర్వహణ కోసం జిల్లా అధికార యంత్రాంగం తమపై తీవ్రఒత్తిడి తీసుకువస్తుందని అధికారులు పనుల విషయంలో నిలదీస్తున్నారని వారు ఆరోపించారు. పంచాయతీ ఖాతాల్లో ఒక్క రూపాయి లేకుండా పనులు ఎలా చేపట్టాలని ప్రశ్నించారు. ఇప్పటికే అన్ని గ్రామాల సర్పంచ్‌లు అభివృద్ధి పనుల పేరిట లక్షలాది రూపాయలు బాకీలు చేసి అప్పులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఆందోళనలు జరుగుతున్న క్రమంలోనే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ సర్పంచ్‌ల సమస్యలతో పాటు గ్రామపంచాయతీ ఖాతాల్లో నిధులు లేని విషయంపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రితో వారు తమ సమస్యల గోడు వెళ్లబోసుకున్నారు. సర్పంచ్‌ల సమస్యలతో పాటు పంచాయతీల నిఽధుల విషయంలో తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి నేతృత్వంలో అవగాహన సదస్సు కొనసాగింది. కాగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యే అవగాహన సదస్సుకు నిరసన తెలిపిన సర్పంచ్‌లు దాదాపు అధి కార పార్టీ వారే కావడం గమనార్హం. 

Updated Date - 2022-05-22T06:56:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising