ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటింటి తనిఖీ.. భారీగా వాహనాల సీజ్‌

ABN, First Publish Date - 2022-05-28T07:03:43+05:30

ప్రజల రక్షణే పోలీసుశాఖ బాధ్యత అని ఏఎస్పీ కిరణ్‌ కారే అన్నారు.

ఓవైసీనగర్‌లో కార్డన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్న ఏఎస్పీ కిరణ్‌కారే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజల సంరక్షణే మా బాధ్యత : ఏఎస్పీ కిరణ్‌కారే

భైంసా, మే 27 : ప్రజల రక్షణే పోలీసుశాఖ బాధ్యత అని ఏఎస్పీ కిరణ్‌ కారే అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఓవైసీనగర్‌ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాంలో భాగంగా కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. పోలీసు బలగాలు మూడుగంటల పాటు తనిఖీలు నిర్వహించారు. సంఘ విద్రోహులు నివాసం ఉండడం, సంచారం చేసే అవకాశాలు ఉంటాయని, వారి ఆట కట్టించే క్రమంలోనే తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు వివరించారు. కొత్త వ్యక్తులు, అనుమానితులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలందరూ స్నేహాభావంతో, ప్రశాంత వాతా వరణంలో ఉండాలని పోలీసులకు ప్రజలందించే సహాకారంతో సంఘ వ్యతి రేక మూకలను మరింత సమర్థవంతంగా అణిచి వేయగలమని అన్నారు. సరైన పత్రాలు లేని 71 ద్విచక్రవాహనాలు, 8 ఆటోలు, 2 టాటా వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కార్డన్‌సెర్చ్‌లో సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐలు, సుమారు 90 మంది పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-05-28T07:03:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising