ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మల్‌లో భారీగా క్లోరల్‌ హైడ్రేట్‌ పట్టివేత

ABN, First Publish Date - 2022-05-16T04:53:11+05:30

నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం 5 క్వింటాళ్ల 60 కిలోల క్లోరల్‌ హైడ్రేట్‌ను ఎక్సైజ్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ అర్బన్‌, మే 15 : నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం 5 క్వింటాళ్ల 60 కిలోల క్లోరల్‌ హైడ్రేట్‌ను ఎక్సైజ్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్‌కు చెందిన మంద అరుణ్‌గౌడ్‌ అనే వ్యక్తి కొంత కాలంగా గుజరాత్‌ నుంచి నిషేధిత మత్తు పదార్థం క్లోరల్‌ హైడ్రేట్‌ను తెప్పిస్తున్నాడు. దీనిని నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల జిల్లాల్లోని సుమారు 50 గ్రామాలకు గుట్టుగా సరఫరా చేస్తున్నాడు. ఆదివారం ఉదయం పక్కా సమాచారం మేరకు నిర్మల్‌కు చేరుకున్న నవత ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాన్‌పై ఎక్సైజ్‌, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడి చేశారు. అందులో మొత్తం 20 సంచుల్లో ఉన్న రూ.28 లక్షల విలువైన క్లోరల్‌ హైడ్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. క్లోరల్‌ హైడ్రేట్‌ అక్రమ రవాణాకు ప్రధాన సూత్రధారి అయిన అరుణ్‌ గౌడ్‌ అరెస్టు చేశారు. అరుణ్‌ గౌడ్‌ను ఇప్పటికే క్లోరల్‌ హైడ్రేట్‌ను తరలిస్తూ రెండు సార్లు పట్టుబడినట్లు ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఎక్సైజ్‌ సీఐలు ప్రవీణ్‌ కుమార్‌, సంపత్‌, ఎస్సైలు కృష్ణకాంత్‌, మహేష్‌, విజయకృష్ణ, యాదగిరి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-16T04:53:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising