కఠోర సాధన
ABN, First Publish Date - 2022-12-07T22:18:39+05:30
కొలువులు కొట్టడమే లక్ష్యంగా యువకులు కఠోర సాధన చేస్తున్నారు. తెల్లవారుజామున అభ్యర్థులు మైదానాలలోకి చేరుకుని ఫిట్నెస్ కోసం కుస్తీ పడుతున్నారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటి ఫికేషన్ జారీ చేసిన నాటి నుంచే యువత దేహదారుఢ్య పరీక్షకు సిద్ధమవుతున్నారు.
- పోలీస్ ఉద్యోగాలు లక్ష్యంగా శ్రమిస్తున్న యువత
- సింగరేణి, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
- దేహదారుఢ్య పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు
కొలువులు కొట్టడమే లక్ష్యంగా యువకులు కఠోర సాధన చేస్తున్నారు. తెల్లవారుజామున అభ్యర్థులు మైదానాలలోకి చేరుకుని ఫిట్నెస్ కోసం కుస్తీ పడుతున్నారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటి ఫికేషన్ జారీ చేసిన నాటి నుంచే యువత దేహదారుఢ్య పరీక్షకు సిద్ధమవుతున్నారు.
ఏసీసీ, డిసెంబరు 7: కొలువులు కొట్టడమే లక్ష్యంగా యువత శ్రమిస్తు న్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జారీ చేసిన పోలీసు ఉద్యోగ నియామక ప్రకటనకు స్పందించి పెద్ద ఎత్తున మహిళ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో యూనిఫాం పోస్టులను పెద్ద ఎత్తున నింపేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ చేపట్టింది. ఆసక్తికలిగిన అభ్యర్థులు అకుంటిత దీక్షతో, నిర్విరామ సాధనతో పరీక్షల్లో నెగ్గి ఉద్యోగాలు సాధించేందుకు శ్రమిస్తున్నారు. పోలీసు ఉద్యోగుల పట్ల సమాజంలో అమితమైన గౌరవం ఉండడంతో పాటు, పోలీసులను ఆశ్రయించే బాధితుల సమస్యలను పరిష్కరించి న్యాయం అందించే అధికారం మొదట పోలీసులకే ఉండడంతో పాటు ఆకర్షనీయమైన జీతభత్యాలు ప్రభుత్వం చెల్లిస్తున్నందున యువత పోలీసు ఉద్యోగాలకు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. ఒక్కసారి పోలీసు ఉద్యోగానికి ఎంపికైతే అంచెలంచెలుగా పదోన్నతులతో ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో పాటు జీతభత్యాల్లో గణనీయమైన పెరుగుదల నిరుద్యోగ యువతకు ఆకర్షనీయంగా మారాయి. పోలీసు ఉద్యోగాల ఎంపిక విధానం మూడు స్థాయిల్లో నిర్వహిస్తున్నారు. మొదట ప్రిలిమినరీ రాత పరీక్ష అనంతరం దేహదారుఢ్య పరీక్ష, మెయిన్స్ రాత పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఉద్యోగాలు వరించనున్నాయి. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్ష పూర్తయి అర్హత సాధించిన అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు సంసిద్దమయ్యారు.
ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు..
ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఈ నెల 8వ తేదీ నుంచి 2023 జనవరి మొదటి వారం వరకు విడతల వారీగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. మహిళా అభ్యర్థులకు కేటగిరీల వారీగా ఎత్తు 150 నుంచి 152.5 సెంటీమీటర్ల ఉండాలి. 800 మీటర్ల పరుగుపందెం, 2.5 మీటర్ల లాంగ్‌జంప్, 4 కిలోల బరువుతో 4 మీటర్ల షాట్‌పుట్, పురుష అభ్యర్థులకు కేటగిరీల వారీగా ఎత్తు 160 నుంచి 167.6 సెంటీమీటర్ల ఉండాల్సి ఉంటుంది. 1600 మీటర్ల పరుగుపందెం, 4 మీటర్ల లాంగ్ జంప్, 7.26 కిలోల బరువుతో 6 మీటర్ల షాట్‌పుట్‌లలో అర్హత సాధించాల్సి ఉంటుంది.
అభ్యర్థికి ఒకసారి మాత్రమే..
ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు, ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్టు పేరిట దేహదారుఢ్య పరీక్షలను ఒక అభ్యర్ధికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు. అందులో వచ్చిన కొలతలు, స్కోర్‌ను అభ్యర్ధి దరఖాస్తు చేసిన అన్ని పోస్టులకు పరిగణలోకి తీసుకుంటున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్ల సెల్ ్ఫ అటెస్టెడ్ కాపీలతో పాటు అడ్మిట్ కార్డు, ఇంటిమేషన్ లెటర్, అభ్యర్ధి సంతకం చేసిన పార్ట్-2 అప్లికేషన్, సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన తెలంగాణ ప్రభుత్వం ద్వారా పొందిన కుల దృవీకరణ పత్రం కాపీ, ఎక్స్ సర్వీస్మెన్లు టీపీవో, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, డిశ్చార్జ్ బుక్, నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్, ఏజెన్సీ ఏరియాలకు చెందిన గిరిజన అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలను పరీక్ష సమయంలో అందజేయాల్సి ఉంటుంది. ఫిజికల్ టెస్టుకు హాజరయ్యే మహిళా అభ్యర్థులు నగలు ధరించరాదు. సెల్ఫోన్లు అనుమతించబడవు. ఫిజికల్ టెస్టులో నిర్దేశిం చిన ఎత్తుకంటే సెంటీమీటర్ తక్కువ ఎత్తు ఉన్నారనే కారణంగా అన ర్హులుగా ప్రకటించిన అభ్యర్థులు వెంటనే పరీక్ష కేంద్రం చీఫ్ సూపరిం టెండెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల ఎత్తును చీఫ్ సూపరింటెం డెంట్ నేతృత్వంలోని కమిటీ సమక్షంలో మరోసారి కొలిచి ఫలితాలను బట్టి సముచిత నిర్ణయాన్ని అదే రోజు వెలువరించేందుకు చర్యలు తీసు కుంటుంది. అభ్యర్థులు పాల్గొనే ఈవెంట్లన్నీ ఆర్ఎఫ్ఐడీ(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) విధానం ద్వారా పారదర్శకంగా కొలతలు తీస్తారు.
అభ్యర్థులకు ఉచిత శిక్షణ..
జిల్లా వ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సింగరేణి, పోలీసు శాఖల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణను అం దిస్తున్నాయి. సింగరేణి ఆధ్వర్యంలో శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియంలో 197 మందికి, మందమర్రిలోని సింగరేణి గ్రౌండ్లో 170 మంది, గుడిపేట 13వ పోలీసు బెటాలియన్‌లో 800 మంది అభ్యర్థులతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ, స్వచ్చంద సంస్థలు ప్రత్యేక శిక్షకులను నియమించి అభ్యర్ధులకు ఉచిత శిక్షణను అందిస్తున్నారు. ఉదయం సాయంత్రం రెండు విడతలుగా సుశిక్షితులైన కోచ్‌లు అభ్యర్థులను బ్యాచ్‌లుగా విభజించి అంతర్గత పోటీల ద్వారా నైపుణ్యతను మెరుగుపరుస్తున్నారు. పురుష అభ్యర్థులతో పాటు మహిళా అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున దేహదారు ఢ్య పరీక్షల కోసం శిక్షణ పొందుతున్నారు. ఉదయం 5 గంటలకే మైదానా లకు చేరుకొని కఠినమైన శిక్షణతో రాటుదేలుతున్నారు. సింగరేణి, పోలీసు శాఖల అద్వర్యంలో శిక్షణ పొందే అభ్యర్థులకు ఉచిత న్యూట్రీషనల్ డైట్‌గా పాలు, గ్రుడ్లు, అరటిపండ్లను పంపిణి చేయడం విశేషం.
ఉద్యోగం సాధించడమే లక్ష్యం..
- దుర్గం శ్రావణి, ఊరుశ్రీరాంపూర్
ప్రిలిమ్స్ రాత పరీక్షలో అర్హత సాధించాను. పోలీస్కానిస్టేబుల్ ఉద్యో గం సాధించడమే లక్ష్యంగా శిక్షణ పొందుతున్నాను. ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలవడంతో పాటు సమాజానికి సేవలందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాను. గ్రామీణ ప్రాంత పేద అభ్యర్థుల కు సింగరేణి, తదితర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అందిస్తున్న శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంది.
అర్హత సాధించే దిశగా శిక్షణ..
- సంపత్, కోచ్, సీసీసీ నస్పూర్
పోలీసు ఉద్యోగాల సాధనకు యువత పట్టుదలతో శిక్షణను పొందుతు న్నారు. ఏకాగ్రతతో సాధన చేస్తే పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగాలు సాధించ డం అసాధ్యమేమి కాదు. దేహదారుఢ్య పరీక్షల్లో అభ్యర్థులు అర్హత సాధిం చే దిశగా ప్రణాళికాబద్ధమైన శిక్షణ అందిస్తున్నాం.
Updated Date - 2022-12-07T22:18:41+05:30 IST