ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండా మల్లేష్‌ సేవలు చిరస్మరణీయం

ABN, First Publish Date - 2022-10-14T03:49:27+05:30

మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ నిరుపేదల గొంతుకగా ఈ ప్రాంతానికి సేవలందించారని, ఆయన సేవలు చిరస్మరణీయమని సీపీఐ జాతీయ కమిటి సభ్యుడు కలవేన శంకర్‌ అన్నారు.

మంచిర్యాలలో గుండా మల్లేష్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సీపీఐ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సీపీఐ జాతీయ కమిటి సభ్యుడు కలవేన శంకర్‌  

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు  13: మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ నిరుపేదల గొంతుకగా ఈ ప్రాంతానికి సేవలందించారని, ఆయన సేవలు చిరస్మరణీయమని సీపీఐ జాతీయ కమిటి సభ్యుడు కలవేన శంకర్‌ అన్నారు.  జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో గురువారం గుండా మల్లేష్‌ రెండో వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూర్‌ మండలం రేచిని గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి సీపీఐ ఎమ్మెల్యేగా, పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఎదిగారన్నారు. ఉమ్మడి రాష్ట్రాల శాసన సభలో ప్రజా సమస్యలపై గళం విప్పారని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌,  పట్టణ కార్యదర్శి కలీందర్‌ ఆలీఖాన్‌, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, జోగుల మల్లయ్య, మిర్యాల రాజేశ్వర్‌రావు, కుంచాల పోచయ్య, దేవి పోచయ్య, మొగిలి లచ్చయ్య, శ్రీను, తదితరులు పాల్గొన్నారు. 

నస్పూర్‌: సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో గుండా మల్లేష్‌ గుండా మల్లేష్‌ చిత్రపటానికి నాయకులు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.  కార్యక్రమంలో మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, ీసీపీఐ నాయకులు లింగం రవి, మిర్యాల రాజేశ్వర్‌రావు,  దొడ్డిపల్లి రవిందర్‌, మొగిళి లక్ష్మణ్‌, తదితరులు పాల్గొన్నారు. 

చెన్నూరు: దివంగత మాజీ ఎమ్మెల్యే గుండ మల్లేష్‌ ద్వితీయ వర్ధంతిని గురువారం సీపీఐ నాయకులు పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో నిర్వహించారు. సీపీఐ మండల కార్యదర్శి నెన్నెల సమ్మయ్య గుండ మల్లేష్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. 

తాండూర్‌: తాండూర్‌లోని భగత్‌సింగ్‌ భవన్‌లో సీపీఐ నాయకులు గుండా మల్లేష్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు మామిడాల రాజేశం, భాస్కర్‌, మల్లయ్య, సంతోష్‌, సారయ్య, శంకర్‌, గోపాల్‌, శ్రీనివాస్‌, రామ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మందమర్రి: రామకృష్ణాపూర్‌ పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో  గుండా మల్లేష్‌  చిత్రపటానికి పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్‌, జిల్లా కార్యవర్గి సభ్యులు ఇప్పకాయల లింగయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, ఏఐటీయుసీ బ్రాంచ్‌ కార్యదర్శి అక్బర్‌ ఆలీ మాట్లాడారు.  కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు నక్క వెంకట్‌స్వామి, వనం సత్యనారాయణ, మిట్టపెల్లి పౌల్‌, కాదండి సాంబయ్య, ఎగుడు మొండి, పోతర్ల రాములు, కారుకూరి రాయలింగు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-14T03:49:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising