ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రూప్‌-1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ABN, First Publish Date - 2022-10-08T03:23:52+05:30

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-1 పరీక్షలు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గ్రూప్‌ -1 పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ ఈనెల 16న జరగనున్న పరీక్షకు జిల్లాలో 27 కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు కేంద్రాల వారీగా పర్యవేక్షక అధికారులు, సిబ్బందిని నియమించామని, కలెక్టర్‌ భవనంలో స్ర్టాంగ్‌ రూం ఏర్పాటు చేశామన్నా రు

సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అదనపు  కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌  

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 7: టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-1 పరీక్షలు పకడ్బందీగా చేపట్టాలని అదనపు  కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ అన్నారు. శుక్రవారం  కలెక్టరేట్‌లో గ్రూప్‌ -1 పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ ఈనెల  16న జరగనున్న పరీక్షకు జిల్లాలో  27 కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు కేంద్రాల వారీగా పర్యవేక్షక అధికారులు, సిబ్బందిని  నియమించామని,  కలెక్టర్‌ భవనంలో స్ర్టాంగ్‌ రూం ఏర్పాటు చేశామన్నా రు. 9,252 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాను న్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్‌ అమలు చేయాలని, విద్యుత్‌  సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకో వాలన్నారు. పరీక్ష కేంద్రాలలో పారిశుధ్యం, తాగు నీరు సరఫరాపై మున్సిపల్‌ శాఖ అధికారులు దృష్టి సారిం చాలన్నారు. అన్ని శాఖల అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు పరీక్ష రోజుకు మూడు రోజుల ముందు నుంచి పరీక్ష కేంద్రాలను  సందర్శిం చాలన్నారు. 16న ఉదయం 6 గంటలకు స్ర్టాంగ్‌ రూం నుంచి పరీక్ష సామగ్రిని కేంద్రాలకు నియమించిన ముఖ్య పర్యవేక్షక అధికారులకు అందించాలన్నారు.  అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయంలోగా చేరుకోవాలన్నారు. ఆర్డీవో వేణు,  అధికారులు పాల్గొన్నారు. 

అవార్డుకు సమాచారం అందించాలి  

జాతీయ పంచాయతీ అవార్డుకు ఈ నెల 10వ తేదీ లోగా పంచాయతీల పూర్తి వివరాలతో నివేదికను  కలెక్టర్‌కు అందించాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ తెలిపారు. శుక్రవారం గూగుల్‌ మీట్‌ ద్వారా జిలా అధికారులతో జాతీయ పంచాయతీ అవార్డుపై సమీక్ష  నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ స్థాయి పంచాయతీ అవార్డుకు  జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుందని, ఈ మేరకు సంబంధిత అధికారులు అన్ని రంగాల్లో పూర్తి స్థాయి లో పరిశీలించి ఉత్తమ గ్రామ పంచాయతీల వివరాల తో నివేధిక అందించాలని ఆదేశించారు.  జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు పాల్గొన్నారు.   

Updated Date - 2022-10-08T03:23:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising