ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేనేత పరిశ్రమకు ప్రభుత్వం చేయూత

ABN, First Publish Date - 2022-08-08T04:19:26+05:30

చేనేత పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతని స్తుందని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని జూబ్లీబార్కెట్‌లో చేనేతజౌళిశాఖ ఆధ్వ ర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవానికి కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, అదనపుకలెక్టర్లు రాజేశం, చాహత్‌బాజ్‌పాయ్‌తో కలిసి ముఖ్యఅతిథిగా హాజర య్యారు.

చేనేత వస్త్రాలను పరిశీలిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, సబ్‌కలెక్టర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఆగస్టు 7: చేనేత పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతని స్తుందని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని జూబ్లీబార్కెట్‌లో చేనేతజౌళిశాఖ ఆధ్వ ర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవానికి కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, అదనపుకలెక్టర్లు రాజేశం, చాహత్‌బాజ్‌పాయ్‌తో కలిసి ముఖ్యఅతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి చేనేత కార్మికులకు సంబంధించిన ప్రతిజ్ఞచేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత పరిశ్రమను ప్రోత్స హించడానికి 40శాతం చేనేతమిత్ర రూపంలో నూలు సబ్సిడీపథకం అమలు చేస్తోందన్నారు. కలెక్టర్‌ రాహు ల్‌రాజ్‌ మాట్లాడుతూ చేనత వస్త్రాల తయారీదా రులను ప్రోత్సహించడానికి ప్రతీ సోమవారం కలెక్టరేట్‌కు వచ్చే అధికారులు తప్పని సరిగా చేనేత దుస్తులు ధరించాలని ఆదే శించారు. చేనేత సహకార సంఘం లిమి టెడ్‌ కాగజ్‌నగర్‌ కార్యదర్శి నల్ల కనకయ్య మాట్లాడుతూ చేనేత కార్మికులకు సబ్సిడీపై ముద్ర రుణాలు అందించాలన్నారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తొలగించాలని, టెస్కో ద్వారా రంగు, రసాయనదారుల వేతనాలు, నేత కూలీలు పెంచాలన్నారు. అంతకుముందు మంచిర్యాల జిల్లా కుశ్నపల్లికి చెందిన లక్ష్మి శంకరయ్య ఆధ్వర్యంలో నేసిన చీరలను కలెక్టర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌, అదనపు కలెక్టర్లు కొనుగోలు చేశారు. చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. కాగా జాతీయ చేనేత దినోత్సవంను పురస్కరించుకని మండలాల వారీగా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

Updated Date - 2022-08-08T04:19:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising