ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికలు ఆరోగ్యంపై దృష్టి సారించాలి

ABN, First Publish Date - 2022-08-11T04:36:38+05:30

బాలికలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని కలెక్టర్‌ భారతి హోళికేరీ అన్నారు. బుధవారం మండలంలోని గుడిపేట రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో కిశోర బాలికలకు పోషకాహార కిట్‌లను పంపిణీ చేశారు.

గుడిపేటలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరీ 

హాజీపూర్‌, ఆగస్టు 10: బాలికలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని కలెక్టర్‌ భారతి హోళికేరీ అన్నారు. బుధవారం మండలంలోని గుడిపేట రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో  కిశోర బాలికలకు పోషకాహార కిట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బాలికల ఇస్తున్న పోషకాహార కిట్‌లను బాలికలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 149 మంది బాలికలకు ఈ కిట్‌లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కిట్‌లను వికలాంగులైన స్కూల్‌డ్రాపౌట్‌లు, 11 నుంచి 18 సంవత్సరాల బాలికలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో ప్రొటీన్‌ పౌడర్‌,ఐరన్‌ సిరప్‌, కాల్షియం టాబ్లెట్‌లు, నెయ్యి, ఖర్జూర, 10 కిలోల గోధుమలు ఉంటాయని తెలిపారు. ఈ కిట్‌లను మూడు నెలలకు ఒకసారి పంపిణీ చేస్తామని వివరించారు.  అనంతరం వన మహోత్సవంలో భాగంగా గుడిపేట రైతు వేదికలో అధికారులు, నాయకులో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో శివానీ డోంగ్రె, జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య, సీడీపీవోలు రేష్మ, హేమసత్య, ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ ప్రసన్న, సర్పంచు లగిశెట్టి లక్ష్మీరాజయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T04:36:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising