ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

ABN, First Publish Date - 2022-10-28T01:31:58+05:30

సారంగాపూర్‌ మండలంలోని బీరవెల్లి మ్యాక్స్‌ కో- ఆపరేటివ్‌ సొసైటీ దొంగతనం కేసులో అంతర్‌రాష్ట్ర నిందితులు ఏడుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

పట్టుబడ్డ నిందితులతో పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ. 6 లక్షల నగదు స్వాధీనం

ఒక కారు, రెండు సెల్‌ ఫోన్లు స్వాధీనం

నిర్మల్‌ టౌన్‌, అక్టోబరు 27 : సారంగాపూర్‌ మండలంలోని బీరవెల్లి మ్యాక్స్‌ కో- ఆపరేటివ్‌ సొసైటీ దొంగతనం కేసులో అంతర్‌రాష్ట్ర నిందితులు ఏడుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. గురు వారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. మ్యాక్స్‌ సొసైటీ బ్యాంక్‌ వెనుక కిటికీ గ్రిల్‌ తొలగించి అందులో ఉన్న రెండున్నర క్వింటాళ్ల బరువైన డబ్బు లున్న తిజోరిని నలుగురు దొంగలు దానిని పైకి తీసి కిటికీ ద్వారా బయ టకు తీసుకువచ్చి కారుడిక్కీలో తీసుకెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. దర్యాప్తు బృందాలు సీసీ కెమెరా ఆధారంగా కారు దొంగతనం జరిగిన తరువాత వంజర గ్రామం మీదుగా సారంగాపూర్‌ వచ్చి అక్కడి నుంచి చించోలి ఎక్స్‌రోడ్‌, రాణాపూర్‌, రోల్‌ మామడ టోల్‌ప్లాజా మీదుగా బోథ్‌ ఎక్స్‌రోడ్‌ కిన్వాట్‌ మీదుగా దహివాడి (మహారాష్ట్ర) గ్రామం, యవ త్మాల్‌ జిల్లా వెళ్లినట్లు 24 గంటల వ్యవధిలోనే పోలీసులు తమ దర్యాప్తులో నిందితుల పేర్లు వారి వివరాలు సేకరించారు. నిందితులు దొరకవద్దు అనే ఉద్దేశ్యంతో పరారైనందున నిర్మల్‌ పోలీసులు చాలా కష్టపడి ఔరంగాబాద్‌, (మహారాష్ట్ర) యవత్మాల్‌ నాందేడ్‌ జిల్లా తిరిగి దొంగలను పట్టుకు రావడానికి ప్రత్యేక బృందాల ద్వారా ప్రయత్నం చేయడం జరిగింది. నిర్మల్‌ రూరల్‌ సీఐ వెంకటేష్‌, సారంగాపూర్‌ ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పక్కా సమాచారం మేరకు సారంగాపూర్‌ మండలం కౌట్ల(బి) గ్రామం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కారు నెంబర్‌ ఎంహెచ్‌ 02 ఏయూ 6179 మారుతి ఎస్టీమ్‌ కారులో ఐదుగురు వ్యక్తులు రావడం గమ నించి వారిని చాకచక్యంగా కారును అడ్డగించి ఐదుగురు వ్యక్తులను పట్టు కొని విచారించగా వారి పేర్లు దత్తరాథోడ్‌, రాజ్‌పుల్‌, సంతోష్‌ రాథోడ్‌, సురేష్‌ఆడే, ప్రకాష్‌ మాడవ అని తెలిపి ఈ రోజు మళ్లీ దొంగతనం చేసేం దుకే నిర్మల్‌ జిల్లాకు వస్తున్నట్లు నిందితులు అంగీకరించారన్నారు. నిర్మల్‌ డీఎస్పీ ఆధ్వర్యంలో త్వరితగతిన చేధించిన నిర్మల్‌ రూరల్‌ సీఐ వెంకటేష్‌, సోన్‌ సీఐ రామ్‌ నరసింహారెడ్డి, ఎస్సైలు చంద్రమోహన్‌, కృష్ణసాగర్‌రెడ్డి, గంగాధర్‌, గీత, ఏఎస్సై సిరాజ్‌, హెచ్‌సీ రవీంద్రరెడ్డి, పీసీఎస్‌ మనోజ్‌, వర్మ, సునీల్‌లను జిల్లా ఎస్పీ అభినందించారు. పోలీసులు ఎప్పటి కప్పుడు అప్ర మత్తంగా ఉండి నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహ రిస్తున్నారని ప్రశంసించారు.

Updated Date - 2022-10-28T01:32:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising