అన్నదాన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
ABN, First Publish Date - 2022-10-18T03:34:35+05:30
రైల్వే స్టేషన్‌లో ఉచిత వైద్య శిబిరానికి వచ్చే రోగులు, వారి బంధువుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత అన్నదానాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోనేరుకోనప్ప అన్నారు. సోమవారం రైల్వేస్టేషన్ సమీపంలో అన్నదానం చేశారు. ఈసందర్భంగా ఆయనమాట్లాడుతూ రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టుతెలిపారు.
కాగజ్‌నగర్, అక్టోబరు 17: రైల్వే స్టేషన్‌లో ఉచిత వైద్య శిబిరానికి వచ్చే రోగులు, వారి బంధువుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత అన్నదానాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోనేరుకోనప్ప అన్నారు. సోమవారం రైల్వేస్టేషన్ సమీపంలో అన్నదానం చేశారు. ఈసందర్భంగా ఆయనమాట్లాడుతూ రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టుతెలిపారు. మార్కెట్ కమిటీచైర్మన్ కాసం శ్రీనివాస్, కోనేరు చారిటబుల్ ట్రస్టుచైర్మన్ కోనేరు వంశీ పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక
చింతలమానేల్లి, పెంచికల్‌పేట మండలాలకు చెం దిన పలువురు సోమవారం ఎమ్మెల్యే కోనప్ప సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌చేస్తున్న అభి వృద్ధిని చూసి ప్రజలు పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు.
Updated Date - 2022-10-18T03:34:35+05:30 IST