ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అపార్ట్‌మెంట్‌లో మంటలు

ABN, First Publish Date - 2022-01-17T15:43:03+05:30

రాజేంద్రనగర్‌ సర్కిల్‌ హైదర్‌గూడలో ఇస్టా సిటీ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఐదో అంతస్తులోని 521 నెంబర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/రాజేంద్రనగర్‌:  రాజేంద్రనగర్‌ సర్కిల్‌ హైదర్‌గూడలో ఇస్టా సిటీ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఐదో అంతస్తులోని 521 నెంబర్‌ ఫ్లాట్‌లో వ్యాపారవేత్త కె.రాము నివసిస్తున్నాడు. సంక్రాంతి నేపథ్యంలో రాము కుంటుంబం శనివారం సాయంత్రం 7:30 గంటలకు నగరంలో ఉండే అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఎదురుగా ఉండే స్నేహితునికి తాళం చెవులు ఇచ్చి వెళ్లారు. ఆదివారం ఉదయం 8గంటల సమయంలో రాము  ఇంట్లో నుంచి పొగ వస్తుండటంతో స్థానికులు వాచ్‌మన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అతను తాళాలు తీసుకుని వెళ్లి చూసేలోగా మంటలతో ఇల్లంతా కాలిపోయింది. రాజేంద్రనగర్‌ పోలీసులు, ఫైర్‌ అధికారులు కలిసి రెండు ఫైరింజన్‌లు వచ్చి మంటలు ఆర్పాయి. ఇంట్లో ఉన్న విలువైన కాగితాలు, నగదు, నగలు కాలిపోయాయని, సుమారు 30లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని ఎస్‌ఐ శ్వేత తెలిపారు. 

Updated Date - 2022-01-17T15:43:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising